Published : 05 May 2022 20:55 IST

Bhala Thandanana: కలానికి, కత్తికి జరిగే పోరాటమే ఈ సినిమా: శ్రీవిష్ణు

ఇంటర్నెట్‌ డెస్క్‌: చూడగానే పక్కింటి కుర్రాడిలా కనిపించే హీరో శ్రీవిష్ణు. ప్రతి కథ విభిన్నంగా ఉండటాన్ని ఇష్టపడే ఈ హీరో చైతన్య దంతులూరి దర్శకత్వంలో నటించిన చిత్రం ‘భళా తందనాన’. కేథరిన్‌తో  నటించిన ఈ సినిమా మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తన మనసులోని భావాలను పంచుకున్నాడు ఈ యంగ్‌ హీరో. తెలుగు టైటిల్స్‌ అంటే ఇష్టమని అందుకే తన సినిమాలకు ‘బ్రోచేవారెవరురా’, ‘రాజ రాజ చోర’, ‘అర్జున ఫల్గుణ’ వంటివి పెట్టానని. తాజా చిత్రానికి కూడా ‘భళా తందనాన’ అని మంచి తెలుగు టైటిల్‌ను ఎంచుకున్నానంటూ ఈ సంవత్సరం సెన్సేషనల్‌ సినిమాలతో అలరింబోతున్నట్లు పేర్కొన్నాడు. ఇంకా ఈ హీరో చెప్పిన ‘భళా తందనాన’ ముచ్చట్లు చూద్దాం.

ఈ సినిమాలో ప్రేక్షకులకు కొత్తగా ఏం చూపించబోతున్నారు?
శ్రీవిష్ణు: క్లైమాక్స్‌ చాలా కొత్తగా ఉంటుంది. స్క్రీన్‌ప్లే కూడా బాగుంది. మంచి ట్విస్ట్‌లు ఉన్నాయి. మ్యూజిక్‌ మణిశర్మ అందించారు. కొంతమంది ఆడియన్స్‌ సౌండ్స్‌ని ఇష్టపడతారు. మణిశర్మ ఈ సినిమాకు మంచి పాటలు, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ అందించారు. 

‘భళా తందనాన’ అనే పేరే ఎందుకు పెట్టారు?
శ్రీవిష్ణు: అన్నమాచార్య రాసిన అన్ని సంకీర్తనలు దేవుడి గురించే రాశారు. ‘భళా తందనాన’ మాత్రం మనుషుల మధ్య వ్యత్యాసాలు ఉండకూడదు, మనుషులు అందరు సమానమే అన్నట్లు ఉంటుంది. అది మా సినిమా కథకు సరిపోతుంది. అందుకే ఈ టైటిల్‌ పెట్టాము. వ్యక్తిగతంగా కూడా నాకు తెలుగు టైటిల్స్‌ అంటే ఇష్టం. 

ఈ సినిమాలో మీ పాత్ర గురించి వివరించండి?
శ్రీవిష్ణు: ఈ సినిమాలో నేను ఒక సామాన్యమైన వ్యక్తిని. హీరోయిన్‌ జర్నలిస్ట్‌. ఒక జర్నలిస్ట్‌తో కలిసి కామన్ మ్యాన్‌ చేసిన సాహసాలు, ప్రజలు కోసం వాళ్లేమి చేశారన్నది కథ. నేను ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో చాలా వరకు మాస్‌ లుక్ లోనే కనిపించాను. ఈ సినిమాలో చాలా విభిన్నమైన పాత్ర నాది. ఒక కలానికి, కత్తికి జరిగే పోరాటమే ఈ ‘భళా తందనాన’ సినిమా.

సినిమాలు విజయం సాధించనప్పుడు, మిశ్రమ స్పందనలు వచ్చినప్పుడు ఎలా స్పందిస్తారు?
శ్రీవిష్ణు: ఒక సినిమా చాలా మంది కష్టంతో కూడుకున్నది. అది ప్రేక్షకాదరణ పొందకపోతే అంతమంది శ్రమ వృథా అవుతుంది. నా వల్ల ఏ నిర్మాత నష్టపోకూడదు అనుకుంటాను. ఇప్పటి వరకు అలా ఎప్పుడూ జరగలేదు. ఎలా చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారో అలా చేయడంకోసం ప్రతి సినిమా నుంచి ఏదో ఒక విషయం నేర్చుకుంటున్నాను. 

కథలు ఎలా ఎంచుకుంటారు. ఎలాంటి కథలను ఇష్టపడతారు?
శ్రీవిష్ణు: నేను కథని నమ్మి సినిమాలు చేస్తాను. మంచి కథలను ఎంచుకుంటాను. కథ బాగుంటే సినిమా ఓటీటీలో అయినా భారీ విజయం సాధిస్తుంది. నేను ఇప్పటి వరకు కొత్త వాళ్లతోనే సినిమాలు చేశాను. రేపు విడుదల కాబోతున్న ‘భళా తందనాన’ సినిమా కథ కూడా చాలా కొత్తగా ఉంటుంది. సినిమా అంతా రూ.2000కోట్ల చూట్టూ తిరుగుతూ ఉంటుంది.

ప్రస్తుతం ఎన్ని సినిమాలు చేస్తున్నారు?
శ్రీవిష్ణు: ప్రస్తుతం ‘అల్లూరి’ అని ఓ పోలీసు ఆఫీసర్‌ జీవిత చరిత్రలో నటిస్తున్నాను. మరో మూడు సినిమాలు ఒప్పుకున్నాను. ఇప్పటి నుంచి చాలా విభిన్నమైన కథలు ఎంచుకుంటున్నాను. 

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని