Manike Mage Hithe: బాలీవుడ్‌లోకి అడుగు పెట్టనున్న యొహాని

 ‘మణికే మాగే హితే’ అంటూ పాట పాడి.. ప్రపంచ వ్యాప్తంగా సంగీత ప్రియుల మనసుదోచుకున్న శ్రీలంక పాప్ సింగర్‌ యొహాని డిసెల్వా.. త్వరలో బాలీవుడ్‌లో గాయనిగా అడుగుపెట్టనుంది.  

Published : 20 Oct 2021 01:06 IST

‘థాంక్‌ గాడ్‌’ చిత్రంతో ఎంట్రీ

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘మణికే మాగే హితే’ అంటూ పాట పాడి.. ప్రపంచ వ్యాప్తంగా సంగీత ప్రియుల మనసుదోచుకున్న శ్రీలంక పాప్ సింగర్‌ యొహాని డిసెల్వా.. త్వరలో బాలీవుడ్‌లో గాయనిగా అడుగుపెట్టనుంది.  అజయ్ దేవగణ్‌, సిద్దార్థ్‌ మల్హోత్రా, రకుల్ ప్రీత్‌ సింగ్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న ‘థాంక్‌ గాడ్‌’ చిత్రంలో యొహాని ‘మణికే..’  పాటని హిందీ వెర్షన్‌లో పాడునున్నారు. ఇదే విషయాన్ని మంగళవారం టీ- సిరీస్‌ సంగీత నిర్మాణ సంస్థ అధికారికంగా ట్విటర్‌లో ప్రకటించింది.‘థాంక్‌ గాడ్‌’ చిత్రానికి నిర్మాతగా భూషణ్‌ కుమార్‌, దర్శకుడిగా ఇంద్రకుమార్‌ వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత భూషణ్‌ కుమార్‌ యొహానితో కలిసి పనిచేయడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. భారతీయ అభిమానులకు ఈ హిట్‌ ట్రాక్‌ని అందించడం, ప్రతిభావంతురాలైన యొహానితో కలిసి పనిచేయడం థ్రిల్లింగ్‌గా ఉందన్నారు. ఇక యొహాని మాట్లాడుతూ..‘‘ భారత్ నుంచి చక్కటి ప్రేమ, ఆదరణ లభించింది, ‘థాంక్‌ గాడ్‌’ టీమ్‌కి నా కృతజ్ఞతలు. త్వరలో ఇండియాకి వచ్చేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అన్నారు. 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని