Sridevi Drama Company: ‘జబర్దస్త్‌’ యోధ ఓణీ వేడుక.. రాకింగ్‌ రాకేశ్‌ కంటతడి!

వినోదాన్ని అందించటంతోపాటు కొత్త ప్రతిభను పరిచయంచేస్తూ, ప్రోత్సహించే కార్యక్రమం ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’.

Published : 04 Feb 2022 19:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వినోదాన్ని అందించటంతోపాటు కొత్త ప్రతిభను పరిచయంచేస్తూ, ప్రోత్సహించే కార్యక్రమం ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’. ‘ఈటీవీ’లో ప్రతి ఆదివారం మధ్యాహ్నం 1గం.కు ప్రసారమయ్యే ఈ షోకి సుడిగాలి సుధీర్‌ వ్యాఖ్యాత. ఈవారం ఎపిసోడ్‌లో ‘జబర్దస్త్‌’ ఫేం యోధ ‘ఓణీ వేడుక’ అలరించనుంది. తాజాగా ప్రోమో విడుదలైంది. సీనియర్‌ నటి అన్నపూర్ణ, ఇంద్రజ, హిమజ, వర్ష తదితరులు ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు. వేడుకల్లో భాగంగా గోరింటాకు పెట్టుకుంటూ వర్ష, హిమజ, ఇంద్రజ నవ్వులు పూయించారు. వీరి మధ్య సుధీర్‌ చేరి మరింత జోష్‌ నింపాడు. ఒంటికాలుతో ‘పుష్ప’ సినిమాలోని ‘శ్రీవల్లి’ పాటకు డ్యాన్స్‌ చేసి కడుపుబ్బా నవ్వించాడు. అనంతరం.. యోధ తన తండ్రితో కలిసి ‘గుమ్మాడీ గుమ్మాడీ’ పాటకు డ్యాన్స్‌ చేసి ఆకట్టుకుంది. యోధ మంచితనం గురించి చెప్తూ రాకింగ్‌ రాకేశ్‌, ఆమె తండ్రి కంటతడి పెట్టుకున్నారు. ప్రేక్షకుల హృదయాల్ని బరువెక్కించారు. బాల్యం నుంచే నటనపై ఆసక్తి చూపిన యోధ.. ‘జబర్దస్త్‌’లో రాకేశ్‌ రాకింగ్‌ టీమ్‌లో పెర్ఫామ్‌ చేసి బుల్లితెర ప్రేక్షకుల్ని విశేషంగా అలరించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని