Sridevi Shoban Babu: సమంత పరిచయం చేసిన ‘శ్రీదేవి శోభన్‌బాబు’.. ఆసక్తిగా టీజర్‌

‘పేపర్‌ బాయ్‌’, ‘ఏక్‌ మినీ కథ’, ‘మంచి రోజులు వచ్చాయి’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న  సంతోష్‌ శోభన్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీదేవి శోభన్‌బాబు’. గౌరి జి. కిషన్‌ కథానాయిక.

Published : 06 Apr 2022 20:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘పేపర్‌ బాయ్‌’, ‘ఏక్‌ మినీ కథ’, ‘మంచి రోజులు వచ్చాయి’తో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంతోష్‌ శోభన్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీదేవి శోభన్‌బాబు’. గౌరి జి. కిషన్‌ కథానాయిక. ప్రశాంత్‌ కుమార్‌ దర్శకుడు. టీజర్‌ను ప్రముఖ నటి సమంత సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపింది. ‘‘నమస్కారం.. ఈ రోజు మనం చెప్పుకోబోయే చిత్రం..’’ అనే వాయిస్‌ ఓవర్‌తో ప్రారంభమైన టీజర్‌ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. రేడియోలో కథ చెప్తున్నట్టుగా పాత్రలను పరిచయం చేసిన తీరు అందరినీ ఆకట్టుకునేలా ఉంది. నాయకానాయికల అల్లరి చూస్తుంటే ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్నట్టు తెలుస్తోంది. మరి ఈ శ్రీదేవి, శోభన్‌ బాబు కథ ఏంటో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. గోల్డ్‌బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సుస్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కమ్రన్‌ స్వరాలందిస్తున్నారు. నాగబాబు, రోహిణి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని