Sridevi Shoban Babu: ‘శ్రీదేవి శోభన్‌బాబు’ల పరిచయం

శోభన్‌ బాబు, శ్రీదేవి జంటగా మనల్ని అలరించడానికి వచ్చేస్తున్నారు. సంతోష్‌ శోభన్‌, గౌరి జి కిషన్‌ ఆ పాత్రల్లో నటిస్తున్న కొత్త సినిమానే ‘శ్రీదేవి శోభన్‌బాబు’. ఈ చిత్ర టీజర్‌ బుధవారం విడుదలయింది. రేడియోలో వస్తున్న వాఖ్యానంతో మొదలైన ప్రచార చిత్రంలో పాత్రలను పరిచయం చేశారు

Updated : 07 Dec 2022 15:50 IST

శోభన్‌ బాబు, శ్రీదేవి జంటగా మనల్ని అలరించడానికి వచ్చేస్తున్నారు. సంతోష్‌ శోభన్‌, గౌరి జి కిషన్‌ ఆ పాత్రల్లో నటిస్తున్న కొత్త సినిమానే ‘శ్రీదేవి శోభన్‌బాబు’. ఈ చిత్ర టీజర్‌ బుధవారం విడుదలయింది. రేడియోలో వస్తున్న వాఖ్యానంతో మొదలైన ప్రచార చిత్రంలో పాత్రలను పరిచయం చేశారు. కమ్రాన్‌ స్వరాలందిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మెల దర్శకత్వం వహిస్తున్నారు. గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై విష్ణు ప్రసాద్‌, సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: సిద్ధార్ధ్‌ రామస్వామి, కూర్పు: శశిధర్‌ రెడ్డి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని