Khushi Kapoor: ఆమీర్ ఖాన్ కుమారుడితో.. ఖుషీ కపూర్ రొమాన్స్
అలనాటి తార దివంగత నటి శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్ ( Khushi Kapoor) ఇండస్ట్రీలో బిజీ కానుంది. ‘లవ్‌టుడే’ రీమేక్‌లో అమీర్ ఖాన్ కుమారుడితో కలిసి నటించనుంది.
ముంబయి: ఇప్పటికే శ్రీదేవి (Sridevi) పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ (Janhvi kapoor) ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి క్రేజీ ఆఫర్లను సొంతం చేసుకుంటుంది. ‘దేవర’తో ఈ అమ్మడు టాలీవుడ్‌లోకి కూడా అడుగుపెట్టింది. ఇక తాజాగా అతిలోక సుందరి చిన్న కుమార్తె ఖుషీ కపూర్ (Khushi Kapoor) కూడా హీరోయిన్‌గా బిజీ కానుంది. ప్రస్తుతం బీ టౌన్‌లో ఈ వార్త ట్రెండింగ్‌లో ఉంది. సౌత్‌లో సూపర్ హిటైన ‘లవ్‌టుడే’ను బాలీవుడ్‌లో రీమేక్ చేయనున్నారు. అందులో హీరోయిన్‌గా ఖుషీ కపూర్‌ను ఎంపిక చేశారు. ఇక ఇదే సినిమాతో బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్‌ఖాన్ తనయుడు జువైద్ ఖాన్ కూడా తెరంగేట్రం చేస్తున్నాడు.
తమిళంలో కేవలం రూ.5కోట్ల బడ్జెత్‌తో రూపొందిన ఈ చిత్రం ఊహించని విజయాన్ని సాధించి రూ.100కోట్లు వసూళ్లు చేసింది. ఇప్పుడు ఇదే సినిమాను దర్శకుడు అద్వైత్ చందన్ హిందీలో భారీ బడ్జెట్‌తో రీమేక్ చేయనున్నారు. ఈ సినిమాతో ఇద్దరు స్టార్ కిడ్స్ ఇండస్ట్రీలోకి వస్తుండడం విశేషం. ఇక మరోవైపు షారుక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్‌తో కలిసి ఖుషీ ‘ది ఆర్చీస్’ (The Archies)లో నటించింది. ఇది త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌లో (Netflix) విడుదల కానుంది. ఖుషీ కపూర్ సినిమాల్లోకి రావడంపై బోనీ కపూర్ (Boney Kapoor) ఆనందం వ్యక్తం చేశారు. ‘‘శ్రీదేవి మరణించే సమయానికి ఖుషీకి 16 ఏళ్లు. ఆమె ఇండస్ట్రీలోకి వస్తుందని నేను, శ్రీదేవి అనుకోలేదు. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవడమే తన ఆశయమని ఖుషీ చెప్పింది’’ అని బోనీ కపూర్ అన్నారు. ఇక ఖుషీ కపూర్ న్యూయార్క్‌లోని లీ స్టార్స్ బర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో నటనలో శిక్షణ తీసుకున్న విషయం తెలిసిందే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
WTC Final: ‘ఆస్ట్రేలియా ఫేవరెట్’.. ఫలితం తారుమారు కావడానికి ఒక్క రోజు చాలు: రవిశాస్త్రి
-
India News
Mamata Banerjee: రైల్వే నా బిడ్డవంటిది.. ఈ ప్రమాదం 21వ శతాబ్దపు అతి పెద్ద ఘటన
-
India News
Odisha Train Tragedy: భారత్‌కు అండగా ఉన్నాం.. రైలు ప్రమాదంపై ప్రపంచ నేతలు!
-
India News
Odisha Train Tragedy: కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ట్రాక్ మారడం వల్లే.. రైల్వే శాఖ ప్రాథమిక నివేదిక
-
Movies News
Punch Prasad: పంచ్ ప్రసాద్‌కు తీవ్ర అనారోగ్యం.. సాయం కోరుతూ వీడియో
-
India News
Train tragedies: భారతీయ రైల్వేలో.. మహా విషాదాలు!