ఆ హీరో బాల్కనీ నుంచి డబ్బు రోడ్డుపై విసిరేసేవారు

రియల్‌స్టార్‌ శ్రీహరి కొన్నివేల మందికి దానాలు చేశారని నటుడు పృథ్వీరాజ్‌ అన్నారు. ఆపదలో ఉన్నామంటూ ఎవరైనా తన ఇంటిముందుకు వస్తే శ్రీహరి బాల్కనీలో నిల్చొని డబ్బుకు రాయికట్టి దానిని గుడ్డలో చుట్టి రోడ్డుపైకి విసిరేసేవారని ఆయన గుర్తు చేసుకున్నారు.

Published : 06 Jun 2021 15:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రియల్‌స్టార్‌ శ్రీహరి కొన్నివేల మందికి దానాలు చేశారని నటుడు పృథ్వీరాజ్‌ అన్నారు. ఆపదలో ఉన్నామంటూ ఎవరైనా తన ఇంటిముందుకు వస్తే శ్రీహరి బాల్కనీలో నిల్చొని డబ్బుకు రాయికట్టి దానిని గుడ్డలో చుట్టి రోడ్డుపైకి విసిరేసేవారని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈటీవీలో సుమ వ్యాఖ్యాతగా ప్రసారమయ్యే ‘క్యాష్‌’ కార్యక్రమంలో హాస్యనటులు పృథ్వీరాజ్‌, బెనర్జీ, సుదర్శన్‌, జ్యోతి పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా ఉదయ్‌కిరణ్‌ గురించి బెనర్జీ మాట్లాడుతూ.. ‘‘ఉదయ్‌కిరణ్‌ మరణం ఒక విధి. లవర్‌బాయ్‌గా మంచి ఇమేజ్‌ వచ్చింది. ఆ తర్వాత ఎక్కడో ఏదో తప్పు జరిగింది. ‘నీకు పెళ్లైంది.. నీకు ఒక భార్య వచ్చింది. సినిమాలు చేస్తున్నావు.. జీవితాన్ని ఎంజాయ్‌ చెయ్‌’ అని నేను చెప్పేవాడిని. కానీ.. అప్పటికే జరగకూడని నష్టం జరిగిపోయింది’ అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సుమ తనదైన పంచులతో అలరించగా కమెడియన్లు డైలాగ్‌లు, టాస్క్‌లతో సందడి చేశారు. కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. పూర్తి కార్యక్రమం జూన్‌ 12న ఈటీవీలో ప్రసారం కానుంది. అప్పటి వరకూ ఈ ప్రోమోను చూసి ఆనందించండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని