Akhanda: డిసెంబరు 2న థియేటర్‌లో దబిడి దిబిడే: శ్రీకాంత్‌

బాలకృష్ణతో ‘శ్రీరామ రాజ్యం’లో లక్ష్మణుడిగా చేశానని, ఇప్పుడు ‘అఖండ’లో రావణాసురుడిలాంటి పాత్ర చేస్తున్నానని నటుడు శ్రీకాంత్‌ అన్నారు.

Updated : 27 Nov 2021 21:32 IST

హైదరాబాద్‌: బాలకృష్ణతో ‘శ్రీరామ రాజ్యం’లో లక్ష్మణుడిగా చేశానని, ఇప్పుడు ‘అఖండ’లో రావణాసురుడిలాంటి పాత్ర చేస్తున్నానని నటుడు శ్రీకాంత్‌ అన్నారు. ‘అఖండ’ ప్రీరిలీజ్‌ వేడుకలో ఆయన మాట్లాడుతూ.. ‘‘సరైనోడు’ తర్వాత నాకు మంచి పాత్ర ఇస్తానని బోయపాటి చెప్పారు. అది కూడా విలన్‌ క్యారెక్టర్‌ అన్నారు. నాకు నమ్మ బుద్ధి కాలేదు. కానీ, ‘అఖండ’లో వరదరాజు పాత్ర చెప్పిన తర్వాత మరో ఆలోచన లేకుండా ఒప్పుకొన్నా. నా పాత్రకు సంబంధించిన గెటప్‌ కోసం బోయపాటి చాలా కష్టపడ్డారు. షూటింగ్‌కు వెళ్లిన మొదటిరోజే బాలకృష్ణతో నటించే అవకాశం వచ్చింది. మొదట కాస్త భయపడ్డాను. బాలకృష్ణ వెన్నుతట్టి ప్రోత్సహించారు. ఈ సినిమాతో మీరొక కొత్త శ్రీకాంత్‌ను చూస్తారు. డిసెంబరు 2న థియేటర్‌లలో దబిడి దిబిడే’’ అని శ్రీకాంత్‌ అన్నారు.

తాను ఇప్పటివరకూ చాలా మంది ఆర్టిస్ట్‌లతో పనిచేశానని, కానీ ఎప్పుడూ ఎనర్జీతో ఉంటూ, తోటి నటీనటుల పట్ల వినయంగా ఉండే బాలకృష్ణలాంటి నటుడిని చూడలేదని నటి పూర్ణ అన్నారు. బాలకృష్ణతో పనిచేయడం తన గాడ్‌ఫాదర్‌తో పనిచేసినట్లు ఉందని అన్నారు. బాలకృష్ణ నటన గురించి ప్రత్యేకంగా క్లాస్‌లు చెప్పవచ్చని అన్నారు. బాలకృష్ణతో నటించే అవకాశం రావటం అదృష్టమని కథానాయిక ప్రగ్యా జైస్వాల్‌ అన్నారు. ఈ సినిమా ఒక చరిత్ర అవుతుందని చెప్పుకొచ్చారు. ప్రతి రోజూ షూటింగ్‌లో బాలకృష్ణను చూసి స్ఫూర్తి పొందానని తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాజమౌళి, అల్లు అర్జున్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని