Vijay 66: విజయ్‌ చిత్రంలో శ్రీకాంత్‌

విజయ్‌ కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. దిల్‌ రాజు, శిరీష్‌, పరమ్‌ వి పొట్లూరి, పెరల్‌ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రష్మిక కథానాయిక. ఈ సినిమా

Updated : 11 May 2022 08:10 IST

విజయ్‌ కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. దిల్‌ రాజు, శిరీష్‌, పరమ్‌ వి పొట్లూరి, పెరల్‌ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రష్మిక కథానాయిక. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో శరత్‌ కుమార్‌, ప్రభు, ప్రకాష్‌ రాజ్‌, జయసుధ, సంగీత, యోగిబాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ చిత్రంలో శ్రీకాంత్‌, కిక్‌ శ్యామ్‌ కూడా భాగమైనట్లు చిత్ర బృందం ప్రకటించింది. విజయ్‌ శైలికి తగ్గట్లుగా సాగే వినూత్నమైన కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. యాక్షన్‌కు ఎంతో ప్రాధాన్యముంది. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్‌, కూర్పు: కెఎల్‌ ప్రవీణ్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని