Avatar 2: ‘అవతార్‌2’కు డైలాగ్‌ రైటర్‌గా అవసరాల శ్రీనివాస్‌

జేమ్స్‌ కామెరూన్‌(James Cameron) అద్భుత సృష్టి అవతార్. ఈ సినిమా సీక్వెల్‌గా ‘అవతార్-‌2’(Avatar-2) ది వే ఆఫ్‌ వాటర్‌ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సీక్వెల్‌ తెలుగు వెర్షన్‌కు ప్రముఖ రచయిత డైలాగులు రాశారు. 

Updated : 13 Dec 2022 17:34 IST

హైదరాబాద్‌: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా అవతార్‌2 (ది వే ఆఫ్‌ వాటర్‌-Avatar: The Way Of Water). దాదాపు 13 ఏళ్ల తర్వాత వస్తున్న ఈ సీక్వెల్‌ కోసం సినీ ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. డిసెంబర్‌ 16న ప్రపంచవ్యాప్తంగా 160 భాషల్లో ఈ చిత్రం విడుదలవ్వనుంది. తెలుగు ప్రేక్షకులను కూడా ఈ సినిమా అదే రోజు పలకరించనుంది. తెలుగువాళ్లకి ఆసక్తి కలిగించే విషయమేమిటంటే ఈ జేమ్స్‌ కామెరూన్‌ అద్భుత సృష్టిలో విలక్షణ రచయిత, నటుడు శ్రీనివాస్‌ అవసరాల(Srinivas Avasarala) కూడా భాగమయ్యారు. తన రచనలతో, నటనతో అందరినీ ఆకట్టుకునే అవసరాల ఈ సినిమా తెలుగు వెర్షన్‌కు డైలాగ్‌లు రాశారు.

ఇక విడుదలకు ముందే ‘అవతార్‌2’ సినిమా రికార్డులు సృష్టిస్తోంది. ప్రీ బుకింగ్స్‌లో ఈ సినిమా హవా చాటూతూ కోట్లు కురిపిస్తోంది. అవతార్‌ మొదటి భాగంలో ప్రేక్షకులను పండోర గ్రహంలో ఊరేగించిన జేమ్స్‌ కామెరూన్‌.. రెండో భాగంలో సముద్ర గర్భంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ విజువల్‌ వండర్‌ను తెరపై చూడాలంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని