Srivishnu: అతడే.. ‘అల్లూరి’

కథల ఎంపిలో కొత్తదనం చూపించే కథానాయకుడు శ్రీవిష్ణు ఇప్పుడు ఓ పోలీస్‌ అధికారి ఫిక్షనల్‌ బయోపిక్‌లో నటిస్తున్నారు. ప్రదీప్‌వర్మ దర్శకుడు. బెక్కెం వేణుగోపాల్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి ‘అల్లూరి’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఈ చిత్ర ఫస్ట్‌ లుక్‌ను శుక్రవారం విడుదల చేశారు.

Updated : 02 Jul 2022 07:09 IST

కథల ఎంపిలో కొత్తదనం చూపించే కథానాయకుడు శ్రీవిష్ణు (Sri Vishnu) ఇప్పుడు ఓ పోలీస్‌ అధికారి ఫిక్షనల్‌ బయోపిక్‌లో నటిస్తున్నారు. ప్రదీప్‌వర్మ దర్శకుడు. బెక్కెం వేణుగోపాల్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి ‘అల్లూరి’ (Alluri) అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఈ చిత్ర ఫస్ట్‌ లుక్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఆ పోస్టర్‌లో శ్రీవిష్ణు ఖాకీ యూనీఫాంలో తుపాకీ పట్టుకొని శక్తిమంతంగా కనిపించారు. ‘నిజాయతీకి మారుపేరు’ అంటూ పోస్టర్‌పై రాసున్న వ్యాఖ్య.. అతని క్యారెక్టర్‌ను సూచించేలా ఉంది. ‘‘నిజాయతీ ఉన్న ఒక పోలీసు అధికారి కథ చెప్పడానికి దర్శకుడు ప్రదీప్‌ చాలా రిసెర్చ్‌ చేశారు. ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి అల్లూరి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? అతను చేసిన త్యాగాలేంటి? సమాజం, ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఒత్తిళ్లు ఎదుర్కొన్నాడు? అన్నవి సినిమాలో ఆసక్తికరంగా చూపించనున్నాం. నిజాయతీ, కర్తవ్యానికి ప్రాధాన్యత ఇచ్చే పోలీసు అధికారులకు ఇది ఘనమైన నివాళిగా ఉంటుంది. ఓ పాట మినహా ఇప్పటికే చిత్రీకరణ పూర్తయింది. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు చిత్ర నిర్మాత. సంగీతం: హర్షవర్ధన్‌ రామేశ్వర్‌, ఛాయాగ్రహణం: రాజ్‌ తోట.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని