Published : 27 May 2022 13:13 IST

Shah Rukh Khan: నైట్‌ పార్టీలో షారుఖ్‌ డ్యాన్స్‌.. సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా మారిన కపుల్స్‌

ముంబయి: బాలీవుడ్‌ బడా నిర్మాత, దర్శకుడు కరణ్‌ జోహార్‌ పుట్టినరోజు వేడుకలు బుధవారం రాత్రి ముంబయిలో ఫుల్‌ జోష్‌తో జరిగాయి. 50వ పుట్టినరోజుని పురస్కరించుకుని బాలీవుడ్‌ ఇండస్ట్రీలోని ప్రముఖులందరికీ కరణ్‌ గ్రాండ్‌ పార్టీ ఇచ్చారు. ముంబయిలోని ఓ రెస్టారెంట్‌లో జరిగిన ఈ వేడుకల్లో చిన్నా, పెద్దా తేడా లేకుండా సెలబ్రిటీలందరూ పాల్గొన్నారు. బడా హీరోలు, ఆనాటి హీరోయిన్స్‌, ఇప్పటి యువ నటులు.. ఇలా అందరూ పార్టీలో తళుక్కున మెరిశారు. దీనికి సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. కాగా, తాజాగా ఈ పార్టీకి సంబంధించిన కొన్ని వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కింగ్‌ఖాన్‌ షారుఖ్‌ తాను నటించిన ‘కుచ్‌ కుచ్‌ హోతా హై’ సినిమాలోని ‘కోయి మిల్‌గయా’ పాటకు స్టైలిష్‌ స్టెప్పులు వేసి అదరగొట్టేశారు. ఆయన డ్యాన్స్‌తో అక్కడ ఉన్న వారందరూ ఫిదా అయ్యారు. ఇక, కరణ్‌-కాజోల్‌ డ్యాన్స్‌ ఫ్లోర్‌పై, రణ్‌వీర్‌ సింగ్‌ టేబుల్‌పై నిలబడి స్టెప్పులేసి అందరిలో ఉత్సాహాన్ని నింపారు.

సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా మారిన తారలు

కరణ్‌ ఇచ్చిన పార్టీలో ఎంతో మంది స్టార్స్‌ హాజరు కాగా.. కొందరు మాత్రం సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా మారారు. ఇంతకీ ఆ తారలు ఎవరంటే.. ఆమిర్‌ఖాన్‌-కిరణ్‌ రావు, హృతిక్‌-సబా ఆజాద్‌, అనుష్క శర్మ, ఆర్యన్‌ ఖాన్‌.

*గతేడాదిలో విడాకులు తీసుకున్న అనంతరం మొదటిసారి కలిసి పార్టీకి హాజరయ్యారు ఆమిర్‌-కిరణ్‌ రావు. వీరిద్దరూ నవ్వుకుంటూ ఫొటోలకు పోజులిచ్చారు.

*హృతిక్‌, నటి సబా ఆజాద్‌ ప్రేమలో ఉన్నారంటూ ఎన్నో రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పలు సందర్భాల్లో డిన్నర్‌ డేట్స్‌కు వెళ్లడంతో ఈ జంట చుట్టూ ఎన్నో ప్రచారాలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా, తాజాగా వీరిద్దరూ కరణ్‌ పార్టీకి కలిసి హాజరయ్యారు. ఒకరినొకరు చూసుకుంటూ చిరు నవ్వులు పూయించారు.

*వివాహం అనంతరం సినిమాలకు దూరంగా ఉన్న అనుష్క ఇప్పుడు మళ్లీ స్క్రీన్‌పై మెరిసేందుకు సిద్ధమవుతోంది. గత కొంతకాలంగా పార్టీలకు కాస్త దూరంగా ఉన్న ఆమె కరణ్‌ పార్టీలో తళుక్కున మెరిశారు. ‘యే దిల్‌ హై ముష్కిల్‌’ కోస్టార్‌ రణ్‌బీర్‌ కపూర్‌, నటి కత్రినా, విక్కీ కౌశల్‌తో కలిసి పార్టీలో సందడి చేశారు.

*డ్రగ్స్‌ కేసుతో ఇటీవల వార్తల్లో నిలిచిన స్టార్‌హీరో షారుఖ్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ సైతం ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఆర్యన్‌ ఎంట్రీ ఇవ్వగానే కెమెరాలన్నీ ఆయన వైపే తిరిగాయి.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని