అందుకే ‘క్రాక్‌’ ప్రమోషన్స్‌కు రాలేకపోయా: శ్రుతి

దాదాపు రెండేళ్ల విరామం తర్వాత వెండితెర వేదికగా ప్రేక్షకులను అలరిస్తున్నారు నటి శ్రుతిహాసన్‌. ‘క్రాక్‌’తో కథానాయికగా రీఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో వరుస ప్రాజెక్ట్‌లు చేస్తున్నారు. కాగా, తాజాగా శ్రుతిహాసన్‌ ఇన్‌స్టా వేదికగా....

Published : 25 Jan 2021 01:03 IST

హైదరాబాద్‌: దాదాపు రెండేళ్ల విరామం తర్వాత వెండితెర వేదికగా ప్రేక్షకులను అలరిస్తున్నారు నటి శ్రుతిహాసన్‌. ‘క్రాక్‌’తో కథానాయికగా రీఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో వరుస ప్రాజెక్ట్‌లు చేస్తున్నారు. కాగా, తాజాగా శ్రుతిహాసన్‌ ఇన్‌స్టా వేదికగా తన అభిమానులతో సరదాగా ముచ్చటించారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు శ్రుతి.. సూటిగా సమాధానమిచ్చారు.

ఇందులో భాగంగా ఓ అభిమాని.. ‘మానసికంగా మిమ్మల్ని ఎంతో బాధకు గురిచేసిన మీ మాజీ ప్రియుడు మైకేల్‌ను మీరు ద్వేషిస్తున్నారా?’ అని ప్రశ్నించగా.. ‘మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు. నేను ఎవర్నీ ద్వేషించను. అతనితో నాకు ఎన్నో ఎమోషన్స్‌ ఉన్నాయి.’ అని తెలిపారు. మరో అభిమాని.. ‘ఈ ఏడాది మీరు పెళ్లి చేసుకోనున్నారా?’ అని అడగ్గా.. లేదని చెప్పారు. అనంతరం మరో నెటిజన్‌.. ‘బిజీగా ఉండడం వల్లే ‘క్రాక్‌’ ప్రమోషన్స్‌లో మీరు పాల్గొనలేదా?’ అని ప్రశ్నించగా.. ‘అవును. ఎందుకంటే ఆ సినిమా ఎప్పుడు విడుదలవుతుందనే దానిపై నాకు సరైన సమాచారం లేదు. ప్రమోషన్స్‌లో పాల్గొనాలని ఎంతో ఆశగా ఎదురుచూశాను. కానీ అదే సమయంలో వేరే ప్రాజెక్ట్‌ పనుల్లో కొంచెం బిజీగా ఉండాల్సి వచ్చింది.’ అని శ్రుతిహాసన్‌ వివరించారు.

ఇదీ చదవండి

నిహారిక పెళ్లి: మా మధ్య మాటలు తగ్గాయ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని