Rajamouli: ఆ హీరోను కించపరచడం నా ఉద్దేశం కాదు: రాజమౌళి

ప్రభాస్‌(Prabhas) నటించిన ‘బిల్లా’(Billa)సినిమా ఆడియో పంక్షన్‌లో బాలీవుడ్‌ హీరో హృతిక్‌ రోషన్‌‌(Hrithik Roshan)పై చేసిన వ్యాఖ్యల గురించి రాజమౌళి(Rajamouli) మాట్లాడారు. తనకు హృతిక్‌ అంటే ఎంతో గౌరవమని తెలిపారు. 

Published : 15 Jan 2023 14:15 IST

హైదరాబాద్‌: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం ఆస్కార్‌ నామినేషన్ల బరిలో నిలవడంతో.. దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) ప్రస్తుతం విదేశాల్లో  బిజీగా ఉన్నారు. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గతంలో తాను బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌(Hrithik Roshan)పై చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. తన మాటల వెనక ఉన్న ఉద్దేశాన్ని వివరించారు.

అసలు విషయమేమిటంటే.. ప్రభాస్‌(Prabhas) నటించిన ‘బిల్లా’(Billa) సినిమా ఆడియో ఫంక్షన్‌లో రాజమౌళి మాట్లాడుతూ ‘ధూమ్‌2(Dhoom 2) సినిమాలో హృతిక్‌ రోషన్‌ను చూసి ఆశ్చర్యపోయాను. ఇప్పుడు ‘బిల్లా’ సినిమా ట్రైలర్‌ చూశాక అర్థమైంది ‘ప్రభాస్‌ ముందు హృతిక్‌ రోషన్‌ నథింగ్’’ అని అన్నారు‌. ఈ వీడియో గత కొన్ని రోజుల నుంచి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. తాజాగా దీని గురించి రాజమౌళి మాట్లాడారు ‘‘15 సంవత్సరాల క్రితం వీడియో ఇప్పుడు ఎందుకు వైరల్‌ అవుతుందో తెలీదు. కానీ నేను ఒక విషయాన్ని అంగీకరించాలి. ఆ వీడియోలో నేను మాట్లాడిన పదాల ఎంపిక బాగాలేదు. హృతిక్‌ని కించపరచడం నా ఉద్దేశం కాదు. నేను అతడిని చాలా గౌరవిస్తాను’’ అని చెప్పారు. ఇక ఈ మాటలు విన్న నెటిజన్లు రాజమౌళిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘తప్పును అంగీకరించడం మీ గొప్పతనం’‘మరోసారి మీ వినయాన్ని చూపారు’ అంటూ రాజమౌళిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

తాజాగా ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘గోల్డెన్‌ గ్లోబ్‌’ (Golden Globe) అవార్డును ‘ఆర్ఆర్‌ఆర్‌’ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఒరిజినల్‌ సాంగ్‌ విభాగానికి గానూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి ‘నాటు నాటు’  పాటకు పురస్కారం వరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని