Vijayendra prasad: ‘విక్రమార్కుడు-2’ రాబోతుంది.. కానీ!
రవితేజ కథానాయకుడిగా ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ‘విక్రమార్కుడు’ చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది. కానీ, తెలుగు కాదు.. హిందీలో మాత్రమే. ‘విక్రమార్కుడు’ చిత్రాన్ని హిందీలో అక్షయ్‌కుమార్‌తో ‘రౌడీ రాథోడ్’గా రీమేక్ చేశారు. దీనికి ప్రభుదేవ దర్శకత్వం
ఇంటర్నెట్ డెస్క్: రవితేజ కథానాయకుడిగా ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ‘విక్రమార్కుడు’ చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది. కానీ, తెలుగులో కాదు.. హిందీలో. ‘విక్రమార్కుడు’ చిత్రాన్ని బాలీవుడ్లో అక్షయ్‌కుమార్‌తో ‘రౌడీ రాథోడ్’గా రీమేక్ చేశారు. దీనికి ప్రభుదేవ దర్శకత్వం వహించగా.. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ నిర్మాతగా వ్యవహరించారు. అక్కడ కూడా ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు సీక్వెల్‌గా ‘రౌడీ రాథోడ్-2’ తీసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
‘విక్రమార్కుడు’కు కథ అందించిన.. దర్శకుడు రాజమౌళి తండ్రి, సినీ రచయిత విజయేంద్ర ప్రసాదే ఈ సీక్వెల్ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారట. స్వయంగా ఆయనే ఈ విషయాన్ని వెల్లడించారు. ‘రౌడీ రాథోడ్-2’ కోసం సంజయ్ లీలా భన్సాలీ.. విజయేంద్ర ప్రసాద్‌ను సంప్రదించారట. దీంతో కథ, స్క్రిప్ట్ రాసివ్వడానికి ఒప్పుకొన్నట్లు తెలుస్తోంది. కాగా.. ‘రౌడీ రాథోడ్’ కథకు కొనసాగింపుగా కాకుండా.. ఒక కొత్త కథతో సీక్వెల్ రాబోతుందట. ఇందులో అక్షయ్ కుమార్.. సోనాక్షి సిన్హా పాత్రలు మాత్రం యథాతథంగా కొనసాగిస్తారని సమాచారం. వచ్చే ఏడాది ఈ చిత్రం పట్టాలెక్కనుంది. మరోవైపు సల్మాన్ ఖాన్ ‘భజరంగీ భాయిజాన్’ చిత్రానికి సీక్వెల్ తీయబోతున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రానికి కథ అందించింది కూడా విజయేంద్ర ప్రసాదే. మరి ‘భజరంగీ భాయిజాన్-2’ చిత్రం కోసం ఆయన పెన్ను పట్టుకుంటారా లేదా తెలియాల్సి ఉంది. దీనిపై ఎలాంటి ప్రకటన అయినా.. సల్మాన్ ఖాన్ ద్వారానే వెల్లడవుతుందని విజయేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు.
► Read latest Cinema News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Jamuna: ‘గుండమ్మ కథ’.. జమున కోసం మూడేళ్లు ఎదురు చూశారట..!
-
Movies News
Vishnu Priya: యాంకర్ విష్ణు ప్రియ ఇంట విషాదం
-
India News
Flight: అసహనంతో ‘విమానం హైజాక్’ అంటూ ట్వీట్
-
Movies News
Jamuna: అలనాటి నటి జమున కన్నుమూత
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
India News
Marriage: 28 ఏళ్ల కోడలిని పెళ్లాడిన 70 ఏళ్ల మామ