Akhanda: బాలకృష్ణ ఆటంబాంబు.. ఎలా వాడాలో బోయపాటికే తెలుసు: రాజమౌళి

సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆటంబాంబులాంటి వారని ఆయనను ఎలా కరెక్ట్‌గా వాడాలో దర్శకుడు బోయపాటి

Published : 28 Nov 2021 01:41 IST

హైదరాబాద్‌: సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆటంబాంబులాంటి వారని ఆయనను ఎలా కరెక్ట్‌గా వాడాలో దర్శకుడు బోయపాటి శ్రీనుకు బాగా తెలుసని అగ్ర దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి అన్నారు. శనివారం ‘అఖండ’ ప్రీరిలీజ్‌ వేడుకకు విచ్చేసిన ఆయన డ్యూయెట్‌ను విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ..‘బోయపాటి శ్రీనుగారు ఈ ఆడిటోరియానికే కాదు, సినిమా ఇండస్ట్రీకి ఒక ఊపు తెచ్చినందుకు ధన్యవాదాలు. డిసెంబరు 2 నుంచి మొదలు పెట్టి వరుసగా థియేటర్‌లన్నీ ప్రేక్షకుల సందడితో నిండిపోవాలి. బాలయ్యబాబు ఒక ఆటంబాంబు. దాన్ని ఎలా కరెక్ట్‌గా ప్రయోగించాలో శ్రీనుగారికి తెలుసు. మీరు ఆ సీక్రెట్‌ అందరికీ చెప్పాలి. దాచేసుకుంటే కుదరదు. బాలయ్యబాబు కూడా ఆయన ఎనర్జీ సీక్రెట్‌ ఏంటో చెప్పాలి. మీ అందరిలాగే నేను కూడా ‘అఖండ’ను థియేటర్‌లో చూడాలని అనుకుంటున్నా’’ అని రాజమౌళి అన్నారు.

నా తొలి సినిమా ‘భైరవద్వీపం’: తమన్‌

తాను మొదటిసారి డ్రమ్స్‌ వాయించింది బాలకృష్ణ నటించిన ‘భైరవద్వీపం’ చిత్రానికేనని, ఆ తర్వాత ఇన్నేళ్లకు మళ్లీ ఆయనతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని సంగీత దర్శకుడు తమన్‌ అన్నారు. సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు తమని తాము మైమరిచిపోతారని బాలకృష్ణ నటన హైలైట్‌గా ఉంటుందని చెప్పారు.

* నందమూరి బాలకృష్ణ సినిమాకు పాడే అవకాశం వచ్చినందుకు గాయకుడు ఎస్పీ చరణ్‌ కృతజ్ఞతలు తెలిపారు. తన తండ్రి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆస్పత్రిలో ఉండగా, కోలుకోవాలని బాలకృష్ణ పూజలు, అర్చనలు చేయించారని, ఆ మేలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. అందుకు ఇప్పుడు ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని