RRR: తారక్‌ను చూసి ఎప్పుడూ ఆశ్చర్యపోతుంటా..: రాజమౌళి
రాజమౌళి దర్శకత్వంలో మోస్ట్ ఏవైటెడ్ ప్రాజెక్టుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ వసూళ్లను రాబట్టిన సినిమా ఆర్‌ఆర్‌ఆర్. ఈ చిత్రంలో అద్భుతమైన నటనతో అలరించిన తారక్ గురించి రాజమౌళి మరోసారి మాట్లాడారు.
హైదరాబాద్: ఆర్‌ఆర్‌ఆర్ ఓ ప్రభంజనం. విడుదలైన అన్ని దేశాల్లో రికార్డు స్థాయిలో విజయాన్ని నమోదు చేసింది. ఇటీవల చికాగోలో జరిగిన కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ గురించి దర్శకుడు రాజమౌళి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్‌కు పనిపై ఉన్న నిబద్ధత, డాన్స్‌పై ఉన్న తపన గురించి మాట్లాడారు. తారక్‌ను చూసి తానెప్పుడూ ఆశ్చర్యపోతుంటానని తెలిపారు.
‘‘తారక్ అద్భుతమైన డాన్సర్. తనకు ఎక్కువ సాధన చేయాల్సిన అవసరం కూడా లేదు. అయినా, ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్ అప్పుడు ఎంతో కష్టపడ్డాడు. 12 గంటలు నిరంతరంగా షూటింగ్ చేశాక కూడా మళ్లీ రూమ్‌కు వెళ్లి మరసటి రోజు షెడ్యూల్ కోసం గంటల తరబడి సాధన చేసేవాడు. జూనియర్ ఎన్టీఆర్ అంటే నాకు అమితమైన గౌరవం ఉంది’ అంటూ తారక్‌పై అభిమానాన్ని వెల్లడించాడు రాజమౌళి.
ఇటీవల ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని, తన తండ్రి విజయేంద్రప్రసాద్ కథను రాసే పనిలో ఉన్నారని రాజమౌళి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ వార్త ఆర్‌ఆర్‌ఆర్ అభిమానుల్లో జోష్ నింపింది. ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఇంకా పేరు ఖరారు కాని ఈ సినిమా NTR30గా ప్రచారంలో ఉంది. తాజాగా విడుదలైన ఎన్టీఆర్ లుక్ ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Prince Harry: ప్రిన్స్ హ్యారీకి అమెరికా ‘బహిష్కరణ’ ముప్పు..!
-
India News
Amritpal Singh: అరెస్టైనవారికి సాయం చేస్తాం: అకాలీదళ్
-
Movies News
Social Look: శోభిత కాఫీ కథ.. సిమ్రత్ సెల్ఫీ.. మృణాళ్ విషెస్
-
Movies News
Rashmika: అప్పుడు విమర్శలు ఎదుర్కొని.. ఇప్పుడు రక్షిత్‌కి క్రెడిట్ ఇచ్చి
-
Politics News
Karnataka: మళ్లీ నేనే సీఎం అన్న బొమ్మై.. కలలు కనొద్దంటూ కాంగ్రెస్ కామెంట్!
-
World News
Russia: పుతిన్‌పై విమర్శలు గుప్పించిన రష్యన్ ‘పాప్‌స్టార్’ మృతి