Rajamouli: రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం..

రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం దక్కింది. ఆస్కార్‌ అకాడమీ నుంచి ఆహ్వానం అందుకున్నారు.

Updated : 26 Jun 2024 10:57 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో ప్రపంచ వేదికపై తెలుగు సినిమా సత్తా చాటారు దర్శకధీరుడు రాజమౌళి. తాజాగా ఆయనతో పాటు ఆయన భార్య రమా రాజమౌళి కూడా అరుదైన ఘనతను దక్కించుకున్నారు. ఆస్కార్‌ అకాడమీలో చేరేందుకు ఆహ్వానం అందుకున్నారు. దర్శకుల కేటగిరిలో రాజమౌళి (SS Rajamouli), కాస్ట్యూమ్‌ డిజైనర్‌ జాబితాలో రమా రాజమౌళి  (Rama Rajamouli) ఈ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సంవత్సరం మొత్తం 57 దేశాల నుంచి 487 మంది సభ్యులకు ఆస్కార్‌ అకాడమీ ఆహ్వానం పంపింది. అందులో భారత్‌ నుంచి వీరిద్దరితో పాటు మరికొందరు సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. షబానా అజ్మి, రితేశ్‌ సిద్వానీ, రవి వర్మన్‌ తదితరులు అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ అండ్‌ ఆర్ట్స్‌ ఆహ్వానం అందుకున్న వారిలో ఉన్నారు.

తాజాగా దీనిపై అకాడమీ పోస్ట్‌ చేస్తూ.. ‘ఈ సంవత్సరం కొత్త సభ్యులకు ఆహ్వానం పంపుతున్నందుకు సంతోషిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన కళాకారులు, నిపుణులకు అకాడమీ స్వాగతం పలుకుతోంది’ అని పేర్కొంది. ఇక టాలీవుడ్‌ నుంచి గతేడాది కొందరు ప్రముఖులు ఈ అకాడమీలో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్‌ఆర్‌లో నటించిన రామ్ చరణ్‌, ఎన్టీఆర్‌లతో పాటు కీరవాణి, సెంథిల్‌కుమార్‌ గతంలో ఈ అకాడమీలో సభ్యత్వం సాధించారు. 

రూ. 4 వేల జీతం నుంచి రూ. 600 కోట్ల ‘కల్కి’ వరకు.. నాగ్‌ అశ్విన్‌ జర్నీ ఇదీ

ఇక సినిమాల విషయానికొస్తే.. రాజమౌళి ప్రస్తుతం మహేశ్‌బాబుతో చేయనున్న ప్రాజెక్ట్‌ పనుల్లో బిజీగా ఉన్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభించనున్నారు. ఇందులో హాలీవుడ్‌ నటీనటులు భాగం కానున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని