Mahesh Babu: అంచనాలు పెంచేలా ‘SSMB 28’ ఆరంభం వీడియో!

అతడు’, ‘ఖలేజా’ చిత్రాలతో టాలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్‌గా నిలిచారు నటుడు మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్‌. ఈ ఇద్దరి కాంబోలో రాబోతున్న మూడో చిత్రం #SSMB28 (వర్కింగ్‌ టైటిల్‌) ప్రకటన వెలువడటమే ఆలస్యం సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది.

Published : 12 Sep 2022 19:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాలతో టాలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్‌గా నిలిచారు నటుడు మహేశ్‌బాబు (Mahesh Babu), దర్శకుడు త్రివిక్రమ్‌ (Trivikram). ఈ ఇద్దరి కాంబోలో రాబోతున్న మూడో చిత్రం #SSMB28 (వర్కింగ్‌ టైటిల్‌) ప్రకటన వెలువడటమే ఆలస్యం సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది. ఎప్పుడెప్పుడు మొదలవుతుందా? అని ఎదురుచూసిన ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ (రెగ్యులర్‌ షూటింగ్‌) సోమవారం ప్రారంభమైంది. దానికి సంబంధించిన వీడియోను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. కథానాయకుడు, నిర్మాతలతో దర్శకుడు చర్చించడం, ఎలా నటించాలో మహేశ్‌కు త్రివిక్రమ్‌ వివరించడాన్ని వీడియోలో చూడొచ్చు. కేవలం మహేశ్‌బాబుపైనే తొలి రోజు షూటింగ్‌ పూర్తయినట్టు తెలుస్తోంది. ఈ వీడియోకు సంగీత దర్శకుడు తమన్‌ అందించిన నేపథ్య సంగీతం సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది. అంతగా మ్యాజిక్‌ చేశారాయన.

‘సుమారు నిమిషం నిడివి ఉన్న వీడియోకే ఇలాంటి బీజీఎం (బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌) ఇస్తే సినిమాకి ఇంకెంతగా ఇస్తావో’ అంటూ నెటిజన్లు, మహేశ్‌ అభిమానులు సోషల్‌ మీడియాలో తమన్‌ గురించి కామెంట్లు పెడుతున్నారు. మహేశ్ ఈ చిత్రంలో పొడవాటి జుత్తుతో చాలా కొత్తగా కనిపించనున్నారు. హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేశ్‌ సరసన పూజాహెగ్డే నటిస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 28న ఈ సినిమా విడుదలకానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని