SSMB28: ఆశ్చర్యపరుస్తోన్న మహేశ్ సినిమా ఓటీటీ రైట్స్..!
మహేశ్ బాబు(Mahesh Babu) హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా (#SSMB28) తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా ఓటీటీ రైట్స్‌పై ఓ వార్త వైరల్ అవుతోంది.
హైదరాబాద్: సూపర్ స్టార్ మహేశ్‌బాబు (Mahesh Babu) ప్రస్తుతం త్రివిక్రమ్(Trivikram) శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ‘అతడు’, ‘ఖలేజా’ సినిమాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమా (#SSMB28) కోసం ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్నట్లు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సంక్రాంతి రోజే ప్రకటించింది. మహేశ్ సరసన పూజా హెగ్డే నటిస్తోన్న ఈ చిత్రంలో శ్రీలీల కీలక పాత్ర పోషిస్తోంది. తాజాగా ఈ మూవీ గురించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.
రూ.80 కోట్లకు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ రైట్స్ సొంతం చేసుకుందంటున్నారు. మహేశ్‌తో పాటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కు కూడా ఇది తొలి పాన్ ఇండియా సినిమా అవ్వడంతో నెట్‌ఫ్లిక్స్ ఇంత భారీగా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక సమాచారం రాలేదు. కానీ ఈ వార్త మాత్రం ఫిల్మ్ సర్కిల్‌లో తెగ తిరిగేస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీని ఈ ఏడాదే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇక మహేశ్ బాబు ఈ సినిమా తర్వాత రాజమౌళి (Rajamouli) యాక్షన్ అడ్వంచర్ (#SSMB29)లో నటించనున్నారు. అగ్ర తారాగణంతో భారీ బడ్జెట్‌తో దీన్ని రూపొందించనున్నారు. తాజాగా ఈ చిత్రం గురించి రాజమౌళి విదేశీ మీడియాలో మాట్లాడుతూ.. ఈ చిత్రం కోసం ‘సీసీఏ’ క్రియేటివ్ ఆర్టిస్ట్స్ ఏజెన్సీ (Creative Artists Agency)తో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. పదేళ్ల నుంచి వాయిదా పడుతూ వస్తోన్న ఈ సినిమా గ్లోబల్ అడ్వెంచర్‌గా రూపొందనుందని వెల్లడించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ap-top-news News
AP Govt: పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు
-
World News
PM Modi: మోదీ అసాధారణ నేత.. చైనాలో భారీగా ఆదరణ
-
Politics News
Balineni: పట్టభద్రుల్లో అసంతృప్తి నిజమే: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి
-
Ap-top-news News
AP Govt: ఎవరి గ్లాసు వారే తెచ్చుకోండి.. రాగి జావ పోస్తాం
-
Politics News
Nara Lokesh: ఎమ్మెల్సీ ఎన్నికలు ట్రైలర్ మాత్రమే.. 2024లో పూర్తి సినిమా: నారా లోకేశ్