Updated : 19 Aug 2022 07:08 IST

SSMB 28: మహేష్‌ 28... ఏప్రిల్‌ 28న

ఈ ఏడాది పట్టాలెక్కుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో మహేష్‌బాబు - త్రివిక్రమ్‌ సినిమా ఒకటి. మహేష్‌ 28వ సినిమా ఇది. చిత్రీకరణ ఇంకా మొదలు కాలేదు. అప్పుడే విడుదల తేదీని ప్రకటించారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 28న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు గురువారం ఓ ప్రత్యేక వీడియోతో ప్రకటించింది చిత్రబృందం. వచ్చే వేసవిలో మహేష్‌ సినిమా హంగామా కొనసాగుతుందన్నమాట. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత మహేష్‌బాబు - త్రివిక్రమ్‌ కలిసి చేస్తున్న సినిమా ఇది. పూజాహెగ్డే కథానాయిక. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. త్వరలోనే చిత్రీకరణ మొదలు కానుంది. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మహేష్‌బాబు ఈ చిత్రం కోసం ఓ ప్రత్యేకమైన లుక్‌ని సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన  విషయాలు, ఇతర వివరాల్ని త్వరలోనే తెలియజేస్తామని నిర్మాత తెలిపారు. ఛాయాగ్రహణం: పి.ఎస్‌.వినోద్, కళ: ఎ.ఎస్‌.ప్రకాశ్, కూర్పు: నవీన్‌ నూలి, సంగీతం: తమన్‌.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని