Stand Up Rahul: ప్రేమకోసం నిలబడాలని చెప్పే ‘స్టాండప్‌ రాహుల్‌’

‘‘నేనూ.. రాజ్‌తరుణ్‌ ఒకేసారి కెరీర్‌ని మొదలుపెట్టాం. తను మంచి నటుడు. తన తొలి సినిమాలా ఉంది ‘స్టాండప్‌ రాహుల్‌’. ఇందులో తను బాగా కనిపిస్తున్నాడ’’ని చెప్పారు కథానాయకుడు వరుణ్‌తేజ్‌. ఆయన బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ‘స్టాండప్‌ రాహుల్‌’ విడుదల ముందస్తు వేడుకకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజ్‌తరుణ్‌, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన చిత్రమిది. శాంటో మోహన్‌ వీరంకి దర్శకుడు. నందకుమార్‌ అబ్బినేని, భరత్‌ మాగులూరి నిర్మాతలు. సిద్ధు ముద్ద సమర్పకులు. ఈ నెల

Updated : 17 Mar 2022 08:18 IST

‘‘నేనూ.. రాజ్‌తరుణ్‌ ఒకేసారి కెరీర్‌ని మొదలుపెట్టాం. తను మంచి నటుడు. తన తొలి సినిమాలా ఉంది ‘స్టాండప్‌ రాహుల్‌’. ఇందులో తను బాగా కనిపిస్తున్నాడ’’ని చెప్పారు కథానాయకుడు వరుణ్‌తేజ్‌. ఆయన బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ‘స్టాండప్‌ రాహుల్‌’ విడుదల ముందస్తు వేడుకకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజ్‌తరుణ్‌, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన చిత్రమిది. శాంటో మోహన్‌ వీరంకి దర్శకుడు. నందకుమార్‌ అబ్బినేని, భరత్‌ మాగులూరి నిర్మాతలు. సిద్ధు ముద్ద సమర్పకులు. ఈ నెల 18న విడుదలవుతోంది. దర్శకుడు అనిల్‌ రావిపూడితో కలిసి బిగ్‌ టికెట్‌ని ఆవిష్కరించిన అనంతరం వరుణ్‌తేజ్‌ మాట్లాడారు. ‘‘దర్శకుడు శాంటో తన విజన్‌ని పక్కాగా తెరపైకి తీసుకొచ్చాడు. రాజ్‌తరుణ్‌, వర్ష చాలా బాగా చేశారు. రాజ్‌తరుణ్‌ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. వర్షకు మంచి భవిష్యత్తు ఉంది’’ అన్నారు. అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ ‘‘నవ్వడం సులభం, నవ్వించడం కష్టం. ఈ సినిమాలో కామెడీనే కాదు, చాలా అంశాలు ఉన్నాయని చిత్రబృందం చెబుతోంది. అందరూ చక్కటి పనితీరు కనబరిచార’’న్నారు. రాజ్‌తరుణ్‌ మాట్లాడుతూ ‘‘నేను ఎప్పటికీ గుర్తు పెట్టుకునే సినిమా ఇది. అగస్త్య రెండేళ్లు ఈ సినిమా కోసమే పనిచేశారు. ఇంద్రజ, మురళీశర్మ, వెన్నెల కిషోర్‌ తదితరులుతో కలిసి పనిచేయడం గొప్పగా అనిపించింది. ఇందులో నేను బాగా నటించానంటే కారణం వర్ష’’ అన్నారు. ఇంద్రజ మాట్లాడుతూ ‘‘మహిళా నటులకీ సత్తా ఉంది, మాకూ పురుషులతో సమానమైన బలమైన పాత్రలు రాస్తే బాగా చేయగలుగుతాం’’ అన్నారు. శాంటో మాట్లాడుతూ ‘‘మీరు దేన్నైనా లేక, ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ల కోసం నిలబడాలని, పోరాటం చేయాలని చెప్పే కథ. అందుకే స్టాండప్‌ కామెడీ నేపథ్యాన్ని ఎంచుకున్నా. రాజ్‌తరుణ్‌ గొప్ప సహకారాన్ని అందించారు. ఇందులో చాలా జోక్స్‌ కథానాయిక వర్ష చెప్పినవే’’ అన్నారు. ‘‘రాజ్‌తరుణ్‌ కనిపించే విధానం కొత్తగా ఉంటుంది. థియేటర్లలో అందరూ చూసే సినిమా ఇది’’ అన్నారు నిర్మాతలు. వర్ష మాట్లాడుతూ ‘‘నేను బాగా నటించడంలో రాజ్‌తరుణ్‌ సహకారం ఉంద’’న్నారు. ఈ కార్యక్రమంలో కిరణ్‌ కొర్రపాటి, సంగీత దర్శకుడు స్వీకర్‌ అగస్త్య, ఛాయాగ్రాహకుడు శ్రీరాజ్‌, ఎడిటర్‌ రవితేజ, సంభాషణల రచయిత నందకిశోర్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని