Stand Up Rahul: ఫన్‌+ ఎమోషన్‌= ‘స్టాండప్‌ రాహుల్‌’ ట్రైలర్‌

రాజ్‌ తరుణ్‌ కథానాయకుడిగా  రూపొందిన చిత్రం ‘స్టాండప్‌ రాహుల్‌’. ‘కూర్చుంది చాలు!!’ అనేది ఉప శీర్షిక.

Published : 04 Mar 2022 17:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రాజ్‌ తరుణ్‌ కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘స్టాండప్‌ రాహుల్‌’. ‘కూర్చుంది చాలు!!’ అనేది ఉప శీర్షిక. వర్ష బొల్లమ్మ కథానాయిక. శాంటో మోహన్‌ వీరంకి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 18న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది. ‘‘మా బాస్‌ ఏ పనైనా రెండే నిమిషాల్లో చేస్తాడట’’ అని స్టాండప్‌ కమెడియన్‌గా రాజ్‌ తరుణ్‌ పలికిన సంభాషణతో ప్రారంభమైన ట్రైలర్‌ ఆద్యందం ఆసక్తిగా సాగింది. కామెడీ, ఎమోషన్‌తో ఈ సినిమాను తెరకెక్కించినట్టు ట్రైలర్‌ను చూస్తుంటే అర్థమవుతోంది. ‘‘లైఫ్‌లో సెటిల్‌ అవడం నీ బ్లడ్‌లోనే లేదు’’ అని రాజ్‌ తరుణ్‌ తల్లి పాత్ర చెప్పిన డైలాగ్‌ ట్రైలర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ స్టాండప్‌ రాహుల్‌ కథేంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. నంద కుమార్‌ అబ్బినేని, భరత్‌ మాగులూరి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో మురళీ శర్మ, వెన్నెల కిశోర్‌ కీలక పాత్రలు పోషించారు. స్వీకర్‌ అగస్తి సంగీతం అందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని