Updated : 20 Jan 2022 07:13 IST

Cinema News: ఇంకా ఏదో కావాలి

2022 అదిరిపోవాలి

ఎప్పటికప్పుడు కొత్త లక్ష్యాలతో ముందుకెళితేనే కెరీర్‌ ఉన్నతంగా సాగుతుంది. సాధించిన దానికి రెట్టింపు ప్రగతి వచ్చే ఏడాదిలో కనపడాలంటే కష్టపడాల్సిందే. దాని కంటే ముందు ఓ గొప్ప లక్ష్యం, ఆశ ఉండాల్సిందే. ఓ మంచి పాత్ర దక్కింది, మంచి గుర్తింపు వచ్చింది కదా అని అక్కడితే ఆగిపోతే నటుల కెరీర్‌లో మైలురాయి లాంటి పాత్రలు దక్కవు. అందుకే   ఎప్పటికప్పుడు కొత్త లక్ష్యాలు నిర్దేశించుకుంటూ ముందుకెళుతుంటారు మన సినీ తారలు. వెండితెరపై గ్లామర్‌ పాత్రల్లో అలరిస్తూనే వైవిధ్యమైన దారిలో నడుస్తున్న కొందరు నాయికలు 2022పై భారీ ఆశలే పెట్టుకున్నారు. గత ఏడాది కంటే ఇంకా ఏదో సాధించేయాలనేది కొందరి అభిమతం. మరి ఆ నాయికలెవరో..వాళ్ల మనసులో మాటేంటో చదివేద్దాం.

సోనాక్షి సిన్హా: ‘‘ఈ ఏడాది నేను పోషించే పాత్రలు, ఎంచుకునే కథలు ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉండాలి. పూర్తి వైవిధ్యంగా సాగాలని కోరుకుంటున్నా. అదృష్ట  వశాత్తు ఇప్పటివరకూ నాకు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించే అవకాశం దక్కింది. డ్రామాస్‌, థ్రిల్లర్స్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్స్‌..ఇలా చాలానే ఉన్నాయి. ఈ ఏడాదీ అంతకుమించి ఉంటుందని ఆశపడుతూ కష్టపడుతున్నాను. కెరీర్‌ పరంగా ఇంకా ఏదో సాధించాలనే తపనతో ఉన్నాను’’.


రకుల్‌ ప్రీత్‌సింగ్‌ : ‘‘నాకు ప్రేమ కథలంటే చాలా ఇష్టం. అలాంటి ఓ మంచి ప్రేమ కథా చిత్రంలో ఈ ఏడాది నటించాలి. అంతేకాదు ఓ జీవిత కథలోనూ నటించాలని ఉంది. అన్ని రకాల కథల్లోనూ నటిస్తూ ప్రయోగాత్మక చిత్రాల్లో సవాల్‌ విసిరే పాత్రలు దక్కాలని కోరుకుంటున్నాను. ఆ దిశగానే అడుగులు వేస్తున్నాను’’.


హ్యూమా ఖురేషి: ‘‘గత ఏడాది నేను తీసుకున్న నిర్ణయాలు, నా పనులతో నేను సంతోషంగానే ఉన్నాను. ఈ ఏడాది మరో అడుగు ముందుకేసి మరిన్ని గొప్ప  నిర్ణయాలు తీసుకోవాలి అనుకుంటున్నాను. ముఖ్యంగా భిన్న రకాలైన ఎంటర్‌టైన్‌మెంట్‌ వేదికల్ని బ్యాలన్స్‌ చేయాలనుకుంటున్నాను. ఓ పక్క ఓటీటీల కోసం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చే సిరీస్‌ల్లో నటిస్తూనే మరోవైపు భారీ బాలీవుడ్‌ చిత్రాల్లో భాగం కావాలనుకుంటున్నాను’’.


పరిణీతి చోప్రా: ‘‘ఈ ఏడాది ఏం సాధిస్తాను అనే దానికంటే.. 2021లో నా లక్ష్యాలు చాలా నెరవేరాయి. మంచి పాత్రలు దక్కాయి. ‘సైనా’, ‘ది గర్ల్‌ ఆన్‌ ది ట్రైన్‌’, ‘సందీప్‌ ఔర్‌ పింకీ ఫరార్‌’ లాంటి చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకోగలిగాను. ఈ ఏడాదీ అంతే గొప్పగా సాగాలని కోరుకుంటున్నాను’’.  


భూమి పెడ్నేకర్‌: ‘‘జీవితం ఎలా వెళితే అలాగే వెళ్లనిస్తాను. ఈ ఏడాదే కాదు ఎప్పుడూ ఓ ప్రత్యేక లక్ష్యాలు అంటూ నాకు ఏమీ ఉండవు. ప్లాన్‌ చేసుకున్నంత మాత్రాన ప్రతీది కచ్చితంగా నెరవేరుతుందని ఏమీ లేదు కదా. ప్రస్తుతం నాకొచ్చిన పనిని చిత్తశుద్ధితో చేస్తున్నాను. నాకు నచ్చిన దర్శకులతో పనిచేస్తున్నాను. ఈ ఏడాది మాత్రం మరింత మంచి జరుగుతుందనే నమ్మకంతో ఉన్నాను’’.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని