Bollywood Movies: బోల్తా కొడుతున్న బాలీవుడ్ మూవీలు.. కారణం అదేనా?
‘హిందీ సినిమాలు ఈ సంవత్సరం ప్రథమార్ధంలో వెనుకబడిన మాట నిజమే. కానీ, సెకండాఫ్‌లో పరిస్థితి చక్కబడుతుంది. పెద్ద హీరోలైన ఆమిర్ ఖాన్, అక్షయ్ సినిమాలు బాలీవుడ్‌కి
ఇంటర్నెట్ డెస్క్: ‘హిందీ సినిమాలు ఈ సంవత్సరం ప్రథమార్ధంలో వెనుకబడిన మాట నిజమే. కానీ, సెకండాఫ్‌లో పరిస్థితి చక్కబడుతుంది. పెద్ద హీరోలైన ఆమిర్ ఖాన్, అక్షయ్ సినిమాలు బాలీవుడ్‌కి పూర్వవైభవం తెస్తాయి’ కొద్దిరోజుల క్రితం ఒక బాలీవుడ్ ప్రముఖుడు చేసిన వ్యాఖ్యలివి. ప్రేక్షకులు కూడా ‘లాల్ సింగ్ చడ్డా’, ‘రక్షా బంధన్’లకు ఆ సత్తా ఉందని నమ్మారు. గతవారం రెండు సినిమాలు ఒకేసారి విడుదలయ్యాయి. కానీ, ఫలితం.. ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్నట్లు ఉంది. కంటెంట్ అంత బలంగా లేదు. ఆమిర్‌ఖాన్ నటనలో కొత్తదనం లేదు. అక్షయ్ సినిమాలో విషయం లేదు. థియేటర్లకి ప్రేక్షకులు రావట్లేదు. ముందు పరాజయం పాలైన సినిమాల విషయంలోను లోపం ఇదే కదా. నిజమే కానీ...ఇవి పెద్ద సినిమాలు మరి.. బాలీవుడ్ బడా స్టార్లు నటించిన చిత్రాలు. ‘లాల్ సింగ్ చడ్డా’ దాదాపు రూ.180కోట్ల బడ్జెట్‌తో తీస్తే, రక్షా బంధన్ బడ్జెట్ రూ.70కోట్లు. రెండు సినిమాల ఓపెనింగ్స్ పరిశీలిస్తే లాల్ సింగ్ చడ్డా మొదటి రోజు రూ.12 కోట్లు వసూలు చేస్తే, రక్షా బంధన్ 8కోట్లు వసూలు చేసింది. ఇక రెండో రోజుకే ఈ వసూళ్లు సగానికి పడిపోయాయి. లోపం ఎక్కడో తెలియక బాలీవుడ్ ట్రేడ్ పండితులు తలలు పట్టుకుంటున్నారు. ఎవరికి తోచిన కారణాన్ని వాళ్లు చెబుతున్నారు.
అసలు కారణం ఏంటి?
బాలీవుడ్లో ఆమిర్ ఖాన్ చిత్రాలకో ప్రత్యేకత ఉంది. ఆయన సినిమాల్లో కంటెంట్ బలంగా ఉంటుందని ప్రేక్షకులు నమ్ముతారు. ఆమిర్ నటించిన గత ఐదు చిత్రాలను పరిశీలిస్తే ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ మినహా అన్నీ విషయం ఉన్న సినిమాలే. స్వదేశంలో అంతగా ఆడని ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ సైతం కథ బాగుండడంతో ఓవర్సీస్(ప్రత్యేకంగా చైనా)లో మంచి కలెక్షన్లను సాధించింది. అయితే రానురాను అదే తరహా కథలను ఎంపిక చేసుకుని ఆమిర్ బోర్ కొట్టిస్తున్నాడని హిందీ ప్రేక్షకులు ఆ మధ్య గుసగుసలాడుకున్నారు. తాజాగా ‘లాల్ సింగ్ చడ్డా’ డీలా పడడంతో విషయం నిజమేనని అర్థమవుతోంది. హావభావాల్లో కొత్తదనం లేదు, సన్నివేశాలు రక్తి కట్టించలేదు, కథనం చప్పగా సాగింది. ఇవి ‘లాల్ సింగ్ చడ్డా’పై తొలిరోజే ప్రేక్షకులు మోపిన అభియోగాలు. మొదటి రోజు థియేటర్లకి 25శాతం ప్రేక్షకులే హాజరయ్యారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. సినిమాకు నిరసనల సెగ తగిలినా, సినిమాపరంగా కూడా ఆకట్టుకోలేకపోవడంతో రెండు రోజే ప్రేక్షకులు పలచబడ్డారు. నిజంగా సినిమాలో విషయం ఉంటే ప్రేక్షకులు థియేటర్లకు హాజరవుతారని కొద్ది నెలల క్రితమే విడుదలైన ‘గంగూభాయి కాఠియావాడి’, ‘భూల్ భులయ్యా-2’ నిరూపించాయి. మరి ఆ స్థాయి విజయం సాధించడంలో లాల్ సింగ్ వెనకబడిందనే చెప్పాలి.
ఇక ఏడాదికి నాలుగైదు సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌కి ఈ సంవత్సరం చేదు అనుభవాన్నే మిగిల్చింది. గతేడాది విడుదలైన ‘సూర్యవన్షీ’ చిత్రం తర్వాత విడుదలైన సినిమాలన్నీ భారీ నష్టాలనే మిగిల్చాయి. ‘బచ్చన్ పాండే’, ‘సమ్రాట్ పృథ్వీరాజ్’ లాంటి భారీ బడ్జెట్ సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. తాజాగా ‘రక్షాబంధన్’ కూడా అదే పంథాలో వెళ్తోందని ఆ సినిమా కలెక్షన్లు చెబుతున్నాయి. మొదటిరోజు దాదాపు రూ.8కోట్లే వసూలు చేసిన ఈ సినిమా రెండోరోజుకి రూ.6 కోట్లకి పడిపోయిందని, అక్షయ్ గత రెండు చిత్రాలు మొదటిరోజు సాధించిన కలెక్షన్లను కూడా రాబట్టలేకపోయిందని బాక్సాఫీస్ గణాంకాలు చెబుతున్నాయి.
స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా వరుస సెలవులు రావడం, బిగ్స్టార్ల సినిమాల విడుదలకు సిద్ధమవడం చూసి, బాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతుందని ఆశించారు. ‘లాల్’ ఏకంగా 3500 తెరలపై విడుదల చేయగా, ‘రక్షాబంధన్’ను 2500 స్క్రీన్లపై విడుదల చేశారు. నిరసన సెగలు, ‘లాల్’ చిత్రంలో దమ్ములేకపోవడంతో మరుసటి రోజే 1000కు పైగా స్క్రీన్లను తెగ్గొసేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తాజా పరిస్థితి చూసి, డిస్ట్రిబ్యూటర్లు లబోదిబోమంటున్నారు.
సినిమా బాగోలేదని టాక్ వస్తే, ప్రేక్షకుడు థియేటర్‌వైపు చూసే పరిస్థితి ప్రస్తుతం లేదు. టికెట్ ధరలను అందుబాటులోకి తెచ్చినా పెద్దగా పట్టించుకోవటం లేదు. ముంబయిలోని ప్రముఖ సింగిల్ స్క్రీన్ థియేటర్లైన గైటీ, జెమిని, మరాఠ మందిర్లు ప్రేక్షకులు లేక వెలవెలబోతున్నాయి. ‘థియేటర్లలో సాధారణ టికెట్ రూ.130, బాల్కనీ రూ.160కు తగ్గించాం. అయినా కూడా ప్రేక్షకులు రావటం లేదు. ‘లాల్ సింగ్ చడ్డా’ నిడివి ఎక్కువ. కథాగమనం చాలా నెమ్మదిగా ఉంది. ఇక ‘రక్షాబంధన్’ ఆ టైటిల్‌ను జస్టిఫై చేయలేకపోయింది’ అని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోజ్ దేశాయ్ అభిప్రాయపడ్డారు. హిందీ చిత్రాల కంటెంట్ అనుకున్న స్థాయిలో ఉండటం లేదని ఐనాక్స్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ సింగ్ జైలా అన్నారు. సక్సస్ సాధించిన ‘భూల్ భూలయ్య2’, ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీయఫ్’, ‘గంగూబాయి కాఠియావాడి’చిత్రాలు మాత్రం మంచి కంటెంట్ ఉండటం ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. దీంతో పాటు, ఓటీటీల హవా కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో సినిమా ఏమాత్రం నెగెటివ్ టాక్ వచ్చినా, ‘ఓటీటీలో చూద్దాంలే’ అని ప్రేక్షకుడు భావిస్తున్నట్లు చెప్పారు. మరి రాబోయే రోజుల్లోనైనా హిందీ చిత్ర పరిశ్రమకు ఊపిరిలూదే సినిమాలు వస్తాయో లేదో చూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యువతరం.. వైవిధ్యమే తొలి విజయం: స్టార్ నటులు మెచ్చిన యంగ్ హీరోలెవరంటే?
విభిన్న కథలను ఎంపిక చేసుకుంటూ విజయాన్ని అందుకుంటున్న యంగ్ హీరోలపై ప్రత్యేక కథనం.. -
ఎవరీ అశ్వత్థామ.. కృష్ణుడు అతడికి ఇచ్చిన శాపం ఏంటి?
ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). ఇందులో ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా (Ashwathama) కనిపించనున్నారు. -
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
ప్రముఖ నటులు కొందరు కలిసి నటిస్తున్న చిత్రాలపై ప్రత్యేక కథనం. ఎవరెవరు ఏయే సినిమాల్లో నటిస్తున్నారంటే? -
నాయికలు ‘తెర’ పంచుకుంటే.. వినోదం పెంచినట్టే
త్వరలో విడుదల కాబోయే సినిమాలు ప్రేక్షకులకు రెట్టింపు వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాయి. అందుకు కారణం ఒకే మూవీలో ఇద్దరు/ ముగ్గురు హీరోయిన్లు కలిసి నటిస్తుండటమే.. -
సీనియర్ హీరోయిన్ల జోరు ‘తగ్గేదే లే’.. ఎవరెన్ని సినిమాలతో బిజీగా ఉన్నారంటే?
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లపై ప్రత్యేక కథనం. త్రిష, నయనతార, తమన్నా.. ఇలా ఎవరెవరు ఎన్ని సినిమాలతో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారంటే? -
పృథ్వీరాజ్ సుకుమారన్ బెస్ట్ మూవీస్.. ఇప్పుడు ‘ఆడుజీవితం’.. ఇంతకుముందు?
పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఉత్తమ చిత్రాలు ఏంటంటే..? -
ఆ అవార్డు అందుకున్న తొలి వ్యక్తిని నేనే అని తెలిసి షాకయ్యా.. అల్లు అర్జున్
నటుడు అల్లు అర్జున్ (Allu Arjun) పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలు. -
రికార్డుల్లోనూ ఫస్టే ఈ నేషనల్ క్రష్.. రష్మిక ఖాతాలో ఘనతలెన్నో!
రష్మిక పుట్టినరోజు సందర్భంగా ఆమె సొంతంచేసుకున్న కొన్ని రికార్డులను చూద్దాం.. -
రామ్ చరణ్ బర్త్‌డే.. ఆయన బాల్యం గురించి ఈ విశేషాలు తెలుసా..?
టాలీవుడ్ ప్రముఖ హీరో రామ్ చరణ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు.. -
Challenging Roles: పాత్రలకు ప్రాణం పోశారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఇలా.. విక్రమ్ అలా!
పాత్రలకు ప్రాణం పోసేందుకు మానసికంగా, శారీరకంగా ఎంతగానో శ్రమించిన నటులు, వారి సినిమాల వివరాలివీ.. -
Tollywood Actresses: అగ్ర నాయికలు అలా రూటు మార్చి.. హాట్‌టాపిక్‌గా నిలిచి!
అగ్ర కథానాయిక- వర్ధమాన హీరో కాంబినేషన్లో వచ్చిన సినిమాల విశేషాలు.. -
Actors turned Directors: ధనుష్, ఉపేంద్ర, కంగన.. మళ్లీ మరో కోణాన్ని చూపించేందుకు...
స్వీయ దర్శకత్వంలో నటించిన హీరో/హీరోయిన్‌పై ప్రత్యేక కథనం. ఎవరు ఏ సినిమాతో అలరించేందుకు సిద్ధమయ్యారంటే? -
Alia Bhatt: అందుకు క్లాస్‌లో బెంచీలు తుడిచి.. బ్యాగ్రౌండ్ ఉన్నా ఆడిషన్ ఇచ్చి: అలియా భట్ బర్త్‌డే స్పెషల్
అలియా భట్ పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి పలు విశేషాలు.. -
Mamitha Baiju: గిరిజ, సాయి పల్లవిలా మమితా బైజు.. రాజమౌళి మెచ్చిన ఈ నటి ఎవరు?
యంగ్ హీరోయిన్ మమితా బైజును అగ్ర దర్శకుడు ప్రశంసించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఎవరీ నటి? -
Comedians as Heros: కమెడియన్లు.. కథానాయకులై.. ఎవరెవరు ఏ సినిమాతో అలరించారంటే?
కమెడియన్లుగా కెరీర్‌ని ప్రారంభించి హీరోగాను సినిమాలు చేస్తున్న నటులపై ప్రత్యేక కథనం.. -
Krystyna Pyszkova: మనిషే కాదు.. మనసూ అందమే: మిస్ వరల్డ్ క్రిస్టినా గురించి ఆసక్తికర విశేషాలివీ
ప్రపంచ సుందరి-2024 కిరీటం దక్కించుకున్న క్రిస్టినా పిస్కోవా గురించి ఆసక్తికర విశేషాలు మీకోసం.. -
Miss World Pageant: తొలుత ‘బికినీ కాంటెస్ట్’గా.. 28 ఏళ్ల తర్వాత భారత్ ఆతిథ్యం.. ‘మిస్ వరల్డ్’ పోటీల సంగతులివీ!
భారత్ ఆతిథ్యంలో 71వ ఎడిషన్ ‘మిస్ వరల్డ్’ పోటీలు జరుగుతున్నాయి. శనివారం విజేతను ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా ఈ అందాల పోటీల గురించి పలు ఆసక్తికర విశేషాలు.. -
Sini Shetty: మిస్ వరల్డ్ పోటీలు.. ‘బెస్ట్ డిజైనర్ డ్రెస్’ విజేతగా సినిశెట్టి
మిస్ వరల్డ్ 2024 పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సినిశెట్టి గురించి ఆసక్తికర విశేషాలివీ.. -
Movies in March: మార్చిలో మురిపించే చిత్రాలు.. వరుణ్ తేజ్ అలా.. ‘టిల్లు’ ఇలా!
మార్చిలో విడుదల కానున్న సినిమాలపై ప్రత్యేక కథనం. ఏ హీరో చిత్రం ఏ రోజు ప్రేక్షకుల ముందుకు రానుందంటే? -
Valentine Day: వాలంటైన్స్ డేకు రీరిలీజ్ కానున్న ప్రేమకథా చిత్రాలివే..
వాలంటైన్స్ డే సందర్భంగా గతంలో అలరించిన ప్రేమ కథాచిత్రాలు మరోసారి వినోదాన్ని పంచేందుకు సిద్ధమయ్యాయి. -
తొలి సినిమా ఫ్లాప్.. ‘బండమొహం వీడేం హీరో’ అన్నారు.. రీల్ కెరీర్ To పొలిటికల్ ఎంట్రీ.. విజయ్ లైఫ్ జర్నీ ఇదే!
Actor vijay: తల్లిదండ్రులకు సినీ నేపథ్యం ఉన్నా, నటుడిగా తనకంటూ తమిళనాట గుర్తింపు తెచ్చుకున్న విజయ్.. రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఈ క్రమంలో ఇప్పటివరకూ ఆయన లైఫ్ జర్నీ ఎలా సాగింది?