స్టార్ల సంతానం.. రూటే సెపరేటు!
విలక్షణ నటుడు మోహన్‌లాల్ కూతురు విస్మయ ఓ పుస్తకం రాసేసింది... అందులోని కవితలు ‘ఓహో సూపర్’ అంటున్నారంతా...అదేంటి? డాక్టర్ల పిల్లలు డాక్టర్లవడం.. యాక్టర్ల సంతానం యాక్టర్లవడమే కదా ట్రెండ్ అంటారా?
విలక్షణ నటుడు మోహన్‌లాల్ కూతురు విస్మయ ఓ పుస్తకం రాసేసింది... అందులోని కవితలు ‘ఓహో సూపర్’ అంటున్నారంతా... అదేంటి? డాక్టర్ల పిల్లలు డాక్టర్లవడం.. యాక్టర్ల సంతానం యాక్టర్లవడమే కదా ట్రెండ్ అంటారా? ముఖ్యంగా సినిమాల్లో నూటికి 90 శాతం ఇంతేగా అన్నది అందరి మాట... కానీ, ఓసారి కెమెరా లెన్స్ జూమ్ చేసి చూస్తే తమ తల్లిదండ్రుల అడుగుజాడల్లో నడవకుండా.. తళుకుబెళుకుల రంగం ఎంచుకోకుండా.. తమదైన దారిలో సాగిపోతున్న సెలబ్రెటీల పిల్లలు కొంతమంది కనిపిస్తారు... తమదైన శైలిలో గుర్తింపు పొందారు. కమాన్ రండి చూసొద్దాం ఆ అరుదైన విజేతల్ని.
మోహన్‌లాల్ కూతురు రచయిత్రి
మూడొందలకుపైగా చిత్రాల్లో నటించిన మోహన్‌లాల్ కేరళలో సూపర్‌స్టార్. ఇంట్లో ఎప్పుడూ సినిమా చర్చలే. ఆయన తలచుకుంటే కూతురు విస్మయ దర్శకత్వం, నటన.. ఏదో ఒక క్రాఫ్ట్‌లో ఇమిడిపోయేదే. కానీ, తండ్రిచాటు బిడ్డగా ఒదిగి ఉండిపోవాలనుకోలేదు ఆమె. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలనుకునేది. చిన్నప్పట్నుంచీ చదువులో మెరిట్. కవితలు బాగా రాసేది. అప్పుడప్పుడు నోటు పుస్తకాల్లో, ఫోన్లో రాసుకున్న కవితలన్నీ గుదిగుచ్చి ‘గ్రెయిన్స్ ఆఫ్ స్టార్ డస్ట్’ పేరుతో పుస్తకం రాసింది. దీన్ని ప్రముఖ ప్రచరుణ సంస్థ పెంగ్విన్ ఇండియా ప్రచురించింది. ‘సినిమాల్లోకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్లిపోవచ్చు. కానీ, నా మనసంతా రాయడంపైనే.. దేశమంతా గుర్తించే ఓ గొప్ప రచయిత్రిగా పేరు తెచ్చుకోవడమే నా మొదటి ప్రయారిటీ’ అంటోంది విస్మయ.
అతడి సిద్ధాంతం వేరు
విలన్‌గా, హాస్యనటుడిగా శక్తి కపూర్‌కి చాలా పేరుంది. కొడుకు సిద్ధాంత్ కపూర్‌ని తన వారసుడిగా చూడాలనుకున్నాడు శక్తి. కన్నవాళ్ల కోరిక కాదనలేక సిద్ధాంత్ అడపాదడపా సినిమాల్లో నటిస్తున్నా నా మనసు మాత్రం సంగీతంపైనే ఉంటుందంటాడు. మ్యూజిక్‌ని మిక్స్ చేయడంలో తను దిట్ట. డీజేయింగ్ అంటే పిచ్చి. ‘బుల్జీయే’ పేరుతో ఎన్నో వేదికలపై ప్రదర్శనలిచ్చాడు. గోవాలో జరిగే అతిపెద్ద మ్యూజిక్ ఫెస్టివల్ ‘సన్‌బర్న్’లోనూ నాలుగుసార్లు తన బృందంతో కలిసి సత్తా చాటాడు.
మానసిక నిపుణురాలు త్రిశాల దత్
రిచాశర్మ, సంజయ్‌దత్‌ల ముద్దుల కూతురు త్రిశాల. చదువుల్లో మెరిట్. మొదట్నుంచీ సినిమా రంగానికి దూరంగానే ఉంటోంది. న్యూయార్క్‌లో న్యాయవిద్య అభ్యసించింది. సైకాలజీలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి డాలర్ల నగరం న్యూయార్క్‌లోనే సైకోథెరపిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టింది. ‘డ్రీమ్ ట్రెసెస్ హెయిర్ ఎక్స్టెన్షన్స్’ అనే వ్యాపార సంస్థ ప్రారంభించింది. తను న్యూయార్క్‌లో ఫేమస్ బ్యూటీ బ్లాగర్. మొదట్లో 110కేజీలతో చాలా లావుగా ఉండేది. కఠిన ఆహార నియమాలతో వెయిట్ తగ్గించుకొని స్లిమ్‌గా మారింది. ఆ అనుభవాలతో రాసిన బ్లాగ్ ఎంతోమందిలో స్ఫూర్తి నింపింది.
ఉత్తమ వ్యాపారి రిషికపూర్ కూతురు
స్టార్ హీరో రిషికపూర్, నీతూ కపూర్ల గారాలపట్టి రిధిమా కపూర్. మొదట్లో సినిమా ప్రయత్నాలు చేసినా తర్వాత రూటు మార్చి తనకంటూ ఓ బాట ఏర్పరచుకుంది. ఓ జ్యువెల్లరీ సంస్థకు మోడలింగ్ చేస్తూ ఆభరణాల డిజైనింగ్ రంగంపై మనసు పారేసుకుంది. సొంతంగా జ్యువెల్లరీ డిజైన్ చేయడం ప్రారంభించింది. తన డిజైన్స్‌ని చాలామంది మెచ్చుకోవడంతో స్నేహితుడు అనూజ్ కపూర్‌తో కలిసి ‘ఆర్ జ్యువెల్లర్స్’ పేరుతో 2016లో సొంత బ్రాండ్ మొదలుపెట్టింది. బాలీవుడ్‌తోపాటు హాలీవుడ్ తారలకూ డిజైన్ చేస్తోంది. రెండేళ్ల తర్వాత కూతురి పేరు మీద ‘శామ్ అండ్ ఫ్రెండ్స్’ అంటూ క్లాతింగ్ బ్రాండ్ కూడా ప్రారంభించింది. ఫిక్కీ ఎఫ్ఎల్వో దిల్లీ ఛాప్టర్ నుంచి ఉత్తమ పారిశ్రామికవేత్తగా అవార్డు అందుకుంది.
రచయిత్రి షహీన్ భట్
మహేశ్ భట్ కూతురు, స్టార్ హీరోయిన్ ఆలియా భట్ సోదరే షహీన్ భట్. ఆ బంధాలు, బంధుత్వాల గురించి కాకుండా తనని తాను ఒక రచయిత్రిగా చెప్పుకోవడానికే ఎక్కువ ఇష్టపడుతుంది షహీన్. టీనేజీలో నుంచి తను పత్రికలకు వ్యాసాలు రాయడం మొదలుపెట్టింది. క్యాంపస్ నుంచి బయటికి రాగానే ‘ఐ హ్యావ్ నెవర్ బీన్ (అన్) హ్యాపియర్’ అనే పుస్తకం రాసింది. గతంలో తాను ఎదుర్కొన్న తీవ్రమైన ఒత్తిడి, మానసిక ఇబ్బందుల్లో ఉన్నప్పటి అనుభవాలే ఈ పుస్తకమట. రాసిన విధానం, ఒత్తిడి నుంచి ఎలా బయట పడాలో సూచించిన వైనానికి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది.
మహేశ్ భట్ కొడుకుది ఫిట్నెస్ బాట
కండరగండడు రాహుల్ భట్‌కి సినిమా హీరో అయ్యేందుకు కావాల్సిన లక్షణాలున్నా తెర వెనకే ఉండటం ఇష్టమట. అతడు ఫిట్నెస్ ఫ్రీక్. జాతీయస్థాయి పోటీల్లో గెలిచాడు. ఇంతకీ తనెవరంటే పూజాభట్కి తమ్ముడు, స్టార్ డైరెక్టర్ మహేశ్ భట్ అబ్బాయి. అబ్బాయిని సినిమాల్లో తీసుకొద్దామని 2006లో మహేశ్‌భట్ అనుకున్నప్పుడు రాహుల్ బరువు 122 కేజీలు. తగ్గించుకోవడానికి జిమ్ బాట పట్టాడు. అప్పట్నుంచి ఫిట్నెస్ ఫ్రీక్‌గా మారిపోయి చివరికి ఫిట్నెస్ ట్రైనర్‌గా అవతారం ఎత్తాడు. బాలీవుడ్లో ప్రస్తుతం అతడు చాలామంది స్టార్లకి శిక్షకుడు. ‘దంగల్’ పాత్ర కోసం అమీర్‌ఖాన్‌కి ఆ రూపం వచ్చేలా తీర్చిదిద్దింది రాహులే.
పేరున్న స్టైలిస్ట్.. మిస్టర్ ఇండియా కూతురు
‘మిస్టర్ ఇండియా’ నటుడు అనిల్‌కపూర్‌కి ఉన్న పేరు, ఫాలోయింగ్ తక్కువేం కాదు. ఆ ఒక్క కారణంతోనే సోనమ్‌కపూర్ బాలీవుడ్లో అరంగేట్రం చేయగలిగింది. తలచుకుంటే అక్కలా తనూ సినిమాల్లోకి రావడం రియా కపూర్‌కి పెద్ద కష్టమేం కాదు. కానీ తళుకుబెళుకుల తెరపై నటించడం నాట్ మై కప్ ఆఫ్ టీ అనుకుంది రియా కపూర్. సినిమాలో ఏమాత్రం సంబంధం లేకుండా ఫ్యాషన్ రంగాన్ని ఎంచుకుంది. ముంబయిలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు నేర్చుకొని ‘రీజన్’ పేరుతో ఫ్యాషన్ బ్రాండ్ ప్రారంభించింది. బాలీవుడ్ తారలతోపాటు దేశంలోని చాలామంది ప్రముఖులకు రియా పర్సనల్ స్టైలిస్ట్‌గా పని చేస్తోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Easter Attacks: ‘నన్ను క్షమించండి..’ శ్రీలంక మాజీ అధ్యక్షుడు సిరిసేన
-
India News
Khushbu Sundar: వీల్‌ఛైర్ కోసం 30 నిమిషాలా?.. ఎయిరిండియాపై ఖుష్బూ అసహనం
-
Sports News
PCB: మికీ ఆర్థర్ పాక్ ‘ఆన్లైన్ కోచ్’.. సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువ
-
Technology News
WhatsApp: వాట్సాప్ వీడియో.. ఈ మార్పు గమనించారా..?
-
Movies News
RRR: ఆస్కార్ బరిలో నిలిచిన చిత్రాలను వెనక్కి నెట్టి.. నంబరు 1గా ‘ఆర్ఆర్ఆర్’
-
Politics News
AAP: కర్ణాటకపై ఆప్ గురి: అజెండాపై కసరత్తు.. పార్టీల హామీలపై కౌంటర్!