Tollywood: నడిపించే నాయికీ
మన సినిమా పోస్టర్‌కి ప్రధాన ఆకర్షణ కథానాయకుడే. వాళ్లని దృష్టిలో పెట్టుకునే ప్రేక్షకుడు థియేటర్‌కి వస్తాడు. వసూళ్లు... రికార్డులపై ప్రభావం చూపించేది కథానాయకులే.
రాబోయే చిత్రాల్లో కీలకం కానున్న హీరోయిన్‌లు
మన సినిమా పోస్టర్‌కి ప్రధాన ఆకర్షణ కథానాయకుడే. వాళ్లని దృష్టిలో పెట్టుకునే ప్రేక్షకుడు థియేటర్‌కి వస్తాడు. వసూళ్లు... రికార్డులపై ప్రభావం చూపించేది కథానాయకులే. ఎంత పెద్ద హీరో కనిపిస్తే... బాక్సాఫీస్ దగ్గర అంత ఘనమైన రికార్డులు నమోదవుతుంటాయి. అలాగని కథానాయికని తక్కువగా చూడలేం. అందమైన జోడీ... విజయవంతమైన జోడీ... ప్రత్యేకమైన జోడీ... అనే మాటల వెనక హీరోయిన్ ప్రభావం సుస్పష్టం. హీరోకి దీటైన పాత్రల్లోనూ... అప్పుడప్పుడూ నాయికా ప్రధానమైన కథల్లోనూ నటిస్తూ బాక్సాఫీస్‌ని ప్రభావితం చేస్తుంటారు. రానున్న కొన్ని సినిమాలకి కథానాయికలే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. అంచనాల్ని పెంచడంలో వాళ్లు కీలకపాత్ర పోషిస్తున్నారు.
కీర్తిసురేష్, సమంత, ఐశ్వర్యరాయ్, త్రిష, అనుష్క... ఇలా అందగత్తెలంతా వరుసగా సందడి చేయనున్నారు. చాలా రోజుల తర్వాత మళ్లీ కథానాయికల జోరు కనిపించనుంది. అయితే వీళ్లంతా నాయికా ప్రధానమైన కథలతోనే రావడం లేదు. ‘శాకుంతలం’తో సమంత మినహా మిగిలినవాళ్లంతా హీరోల సినిమాలతోనే ప్రభావం చూపిస్తున్నారు.
* అనుష్క ‘సైలెన్స్’ తర్వాత మళ్లీ తెరపై కనిపించలేదు. ఆమె చాలా రోజుల తర్వాత యువ కథానాయకుడు నవీన్ పొలిశెట్టితో జట్టు కట్టి ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’లో నటించింది. ఈ వేసవిలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకి నవీన్ పొలిశెట్టి ఎంత ఆకర్షణో... అనుష్క కూడా అంతే ఆకర్షణగా మారింది. ఒకప్పుడు నాయికా ప్రధానమైన సినిమాలు చేసిన అనుష్క... విరామం తర్వాత చేసిన ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ నెల 30నే ప్రేక్షకుల ముందుకొస్తున్న ‘దసరా’ విషయంలో నాని పోషించిన ధరణి పాత్ర ఎంత పాపులర్ అయ్యిందో, కీర్తి సురేష్ పోషించిన వెన్నెల పాత్ర కూడా అంతే ప్రాచుర్యం పొందింది. ఈ కథకి ఆమె పాత్ర కీలకం అని చిత్రబృందం ప్రచారం చేస్తోంది. ‘మహానటి’ తర్వాత అంతగా భావోద్వేగాల పరంగా నాకు కనెక్ట్ అయిన సినిమా అని కీర్తి కూడా ప్రత్యేకంగా చెబుతూ అంచనాలు పెంచుతోంది. రవితేజ కథానాయకుడిగా నటించిన ‘రావణాసుర’లో ఏకంగా ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. అను ఇమ్మానుయేల్, మేఘ ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడ సినిమాకి ప్రత్యేకమైన అందాన్ని తీసుకొస్తున్నారు. మరి ఆయా పాత్రలతో సినిమాపై ఏ స్థాయిలో ప్రభావం చూపిస్తారనేది కీలకంగా మారింది.
* సినిమానంతా భుజాలపై మోసే కథానాయికలు చాలా అరుదు. అలాంటి అరుదైన కథానాయికల జాబితాలో సమంత ఒకరు. కొన్నేళ్లుగా దక్షిణాదిన నాయికా ప్రధానమైన కథలకి కేరాఫ్‌గా మారారు. ‘యశోద’ తర్వాత ఆమె మరోసారి తన చుట్టూ తిరిగే కథతో ‘శాకుంతలం’ చేశారు. కాళిదాసు రచన ఆధారంగా గుణశేఖర్ తెరకెక్కించిన ఈ చిత్రం ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేమకావ్యంగా రూపొందిన ఈ సినిమాలో శకుంతలగా తన అందచందాలతోనూ, నటనతోనూ కట్టిపడేయనుంది సమంత. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి. ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకొస్తున్న ‘పొన్నియిన్ సెల్వన్ 2’ సినిమాకి కూడా తారల గ్లామరే ప్రధాన ఆకర్షణ. హీరోలకి దీటుగా ఐశ్వర్యరాయ్, త్రిష పోషిస్తున్న పాత్రలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తొలి భాగంలో కథల్ని మలుపు తిప్పే పాత్రల్లో నటించి ఈసారి మరిన్ని అంచనాల్ని పెంచుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
కుటుంబంలో మద్యం చిచ్చు.. భార్యాభర్తల ఆత్మహత్య
-
India News
నా భర్త కళ్లలో చెదరని నిశ్చలత చూశా
-
India News
ప్రపంచంలో ఎక్కడినుంచైనా శబరి గిరీశునికి కానుకలు
-
General News
పెళ్లికి వచ్చినా బలవంతపు తరలింపులేనా?
-
Ts-top-news News
38 రోజులపాటు జోసా కౌన్సెలింగ్
-
India News
ప్రతి 5 విద్యార్థి వీసాల్లో ఒకటి భారతీయులకే.. అమెరికా రాయబారి వెల్లడి