Aparna Balamurali: అపర్ణా బాలమురళీతో స్టూడెంట్‌ అనుచిత ప్రవర్తన.. వీడియో వైరల్‌

‘ఆకాశం నీ హద్దురా’(Aakaasam Nee Haddhu Ra)తో తెలుగువారికి చేరువైన కేరళ భామ అపర్ణా బాలమురళీ (Aparna Balamurali). తాజాగా ఓ సినిమా ప్రమోషన్‌లో పాల్గొన్న ఆమెకు చేదు అనుభవం ఎదురైంది.

Updated : 20 Jan 2023 18:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘సూరారై పోట్రు’ (Soorarai Pottru)తో జాతీయ నటిగా గుర్తింపు తెచ్చుకున్న అపర్ణా బాలమురళీ (Aparna Balamurali)కి చేదు అనుభవం ఎదురైంది. ఓ కళాశాల ఈవెంట్‌లో పాల్గొన్న ఆమెతో ఓ స్టూడెంట్‌ అనుచితంగా ప్రవర్తించాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దానిని చూసిన పలువురు నెటిజన్లు ఆ యువకుడి ప్రవర్తనను తప్పుబడుతున్నారు.

అపర్ణా బాలమురళీ (Aparna Balamurali) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త చిత్రం ‘తన్కమ్‌’ (Thankam). ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తన సహనటుడు వినీత్‌ శ్రీనివాసన్‌తో కలిసి ఆమె కేరళలోని ఓ లా కాలేజీలో సందడి చేశారు. అపర్ణ స్టేజ్‌పై కూర్చొని ఉండగా.. ఓ విద్యార్థి అక్కడికి చేరుకుని ఆమెకు షేక్‌హ్యాండ్‌ ఇచ్చాడు. అనంతరం ఆమె చేయి పట్టుకుని లాగి నిల్చొమని బలవంతం చేశాడు. దీంతో చేసిదిలేక ఆమె నిల్చొగానే.. ఆ యువకుడు భుజంపై చేయి వేయబోయాడు. యువకుడి అనుచిత ప్రవర్తనకు కంగుతిన్న ఆమె.. అతడి నుంచి దూరంగా జరిగింది. ఈ ఘటనపై అపర్ణ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ విద్యార్థి తిరిగి స్టేజ్‌పైకి వచ్చి.. ఆమెకు క్షమాపణలు చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఆ యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఎదుటి వ్యక్తులతో ఎలా ప్రవర్తించాలో ముందు తెలుసుకోవాలి’’, ‘‘క్షమాపణలు చెప్పినంత మాత్రాన సరిపోతుందా?’’ అంటూ ప్రశ్నిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని