stuntman sri badri: ‘భోళా శంకర్‌’ మూవీ పారితోషికాన్ని విరాళంగా ఇచ్చిన స్టంట్‌మ్యాన్‌ శ్రీబద్రి

తెలుగు సినిమాల్లో ప్రమాదకరమైన స్టంట్స్‌తో అలరించిన స్టంట్‌మ్యాన్‌ శ్రీబద్రి జనసేన పార్టీకి విరాళం అందించారు.

Published : 28 Sep 2023 02:10 IST

హైదరాబాద్‌: తెలుగు, తమిళ చిత్రాల్లో ఎన్నో ప్రమాదకరమైన స్టంట్స్‌ను అలవోకగా చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు స్టంట్‌మ్యాన్‌ శ్రీబద్రి. చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘భోళా శంకర్‌’. ఇందులో ఓ కారును నడుపుతూ ఆయన చేసిన స్టంట్‌కు ప్రశంసలు దక్కాయి. ఆ స్టంట్‌ చేసినందుకుగానూ శ్రీబద్రి (stuntman sri badri) రూ.50వేల పారితోషికం అందుకున్నారు. తాజాగా ఆ మొత్తాన్ని జనసేన పార్టీకి (janasena party)విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను కలిసి అందుకు సంబంధించిన చెక్‌ను అందించారు.

ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) మాట్లాడుతూ.. ‘తెలుగు చిత్ర పరిశ్రమలో వెహికల్స్‌తో ఎలాంటి డేర్‌ డెవిల్స్‌ స్టంట్స్‌ చేయాలన్నా అది బద్రిగారికే సాధ్యం. నేను నటుడిగా శిక్షణ పొందుతున్న దగ్గరి నుంచి ఆయన నాకు పరిచయం. ‘భోళా శంకర్‌’లో కారుతో ఓ స్టంట్‌ చేసినందుకు అందుకున్న రూ.50వేల పారితోషికాన్ని జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చారు. మనస్ఫూర్తిగా ఆయనికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’ అని అన్నారు.

ఓటీటీలో ఈ వారం సందడే సందడి.. ఏయే చిత్రాలొస్తున్నాయంటే?

అనంతరం శ్రీబద్రి మాట్లాడుతూ.. ‘సాటి మనిషికి సాయం చేయాలన్న మనస్తత్వం కలిగిన వ్యక్తి మీరు(పవన్‌ కల్యాణ్‌). 28 సంవత్సరాల కిందట మీరు నాకు సాయం చేశారు. దాని వల్ల నేను స్టంట్‌మ్యాన్‌ అయి, భార్య పిల్లలతో సంతోషంగా ఉన్నా. నా చిన్న కుమార్తె అమెరికాలో చదువుకుంది. అంతా మీ దయ. మీరు చేసే సాయం నాతో ఆగిపోకూడదు. మీ వల్ల ఎంతో మంది సాయం పొందుతున్నారు. ఇంకా పొందాలి. మీరు సీఎం అయి, నాలాంటి వాళ్లకు సాయం చేయాలి’’ అని శ్రీబద్రి అన్నారు. ఇక పవన్‌కల్యాణ్‌ సినిమాల విషయానికొస్తే, ప్రస్తుతం ఆయన హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’లో నటిస్తున్నారు. ఇందులో ఆయన పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని