Vikrant Rona:‘విక్రాంత్‌ రోణ’.. మళ్లీ వెనక్కి

కరోనా పరిస్థితుల వల్ల ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ‘విక్రాంత్‌ రోణ’.. మరోసారి వెనక్కి తగ్గింది. కిచ్చా సుదీప్‌ హీరోగా నటించిన పాన్‌ ఇండియా చిత్రమిది. అనూప్‌ భండారి తెరకెక్కించారు. ఈ

Updated : 28 Jan 2022 07:03 IST

కరోనా పరిస్థితుల వల్ల ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ‘విక్రాంత్‌ రోణ’.. మరోసారి వెనక్కి తగ్గింది. కిచ్చా సుదీప్‌ హీరోగా నటించిన పాన్‌ ఇండియా చిత్రమిది. అనూప్‌ భండారి తెరకెక్కించారు. ఈ సినిమాని ఫిబ్రవరి 24న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ, ప్రస్తుత కొవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమాని వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు గురువారం సామాజిక మాధ్యమాల వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది. కాస్త ఆలస్యమైనా ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో థియేటర్లలోనే విడుదల చేస్తామని, త్వరలో కొత్త రిలీజ్‌ డేట్‌ ప్రకటిస్తామని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. విభిన్నమైన యాక్షన్‌ అడ్వంచర్‌ కథాంశంతో.. త్రీడీలో రూపొందించిన చిత్రమిది. 14 భాషల్లో.. 55 దేశాల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో నిరూప్‌ భండారి, నీతా అశోక్‌, జాక్వెలిన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. బి.అజనీష్‌ లోక్‌నాథ్‌ స్వరాలందించారు. విలియమ్‌ డేవిడ్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని