Sudha Kongara: రతన్ టాటా బయోపిక్.. సుధా కొంగర క్లారిటీ
సూర్య, అభిషేక్ బచ్చన్ కీలకపాత్రధారులుగా సుధా కొంగర త్వరలోనే రతన్ టాటా బయోపిక్ తెరకెక్కించనున్నారంటూ వస్తోన్న వార్తలపై దర్శకురాలు స్పందించారు.
చెన్నై: ‘ఆకాశమే నీ హద్దురా’తో దర్శకురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు సుధా కొంగర. ప్రస్తుతం ఆమె అక్షయ్‌కుమార్‌తో ఇదే చిత్రాన్ని హిందీలో తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఆమె త్వరలోనే ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా బయోపిక్ తెరకెక్కించనున్నారని ఇటీవల పలు పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఆయా వార్తలపై తాజాగా ఆమె స్పందించారు. అవన్నీ వదంతులు మాత్రమేనని చెప్పారు. ‘‘రతన్ టాటాకు నేను వీరాభిమానిని. ఆయన బయోపిక్ తెరకెక్కించాలనే ఆలోచన ప్రస్తుతానికి నాకు లేదు. నా తదుపరి సినిమా గురించి మీరు చూపిస్తోన్న ఆసక్తికి ధన్యవాదాలు. త్వరలోనే నా సినిమా వివరాలు ప్రకటిస్తా’’ అని ఆమె పేర్కొన్నారు.
సూర్య కథానాయకుడిగా ఆమె తెరకెక్కించిన ‘ఆకాశమే నీ హద్దురా’ కూడా ఓ బయోపిక్ అనే విషయం తెలిసిందే. ఎయిర్ డెక్కన్ అధినేత గోపీనాథ్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని దీన్ని తెరకెక్కించారు. బయోపిక్‌లను నిర్మించడంలో సుధాకు సాటి లేరని సినీ ప్రియులు మెచ్చుకున్నారు. ఈ క్రమంలో ఆమె నుంచి రతన్‌టాటా బయోపిక్ వస్తుందనే వార్తలు వచ్చాయి. దీనిపై దర్శకురాలు తాజాగా స్పందించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Couple Suicide: కరోనా దెబ్బకు నెమ్మదించిన వ్యాపారం.. అధిక వడ్డీలకు అప్పులతో..
-
Crime News
హైదరాబాద్‌లో పేలుళ్ల కుట్రకు సూత్రధారి ఫర్హతుల్లానే!
-
General News
Bhadrachalam: రాములోరి పెళ్లికి ఖమ్మం గోటి తలంబ్రాలు
-
Sports News
Steve Smith: ధోనీకి కెప్టెన్‌గా కొంచెం కష్టపడ్డా: స్టీవ్ స్మిత్
-
India News
Ballari: బళ్లారి నగర పాలికె మేయర్‌గా 23 ఏళ్ల యువతి
-
Politics News
Raghurama: ముందస్తు ఎన్నికలకు ముఖ్యమంత్రి ప్రయత్నం: రఘురామ