Sudheer Babu: సుధీర్‌బాబు షాకింగ్‌ ట్విస్ట్‌.. ఫొటో షేర్‌ చేసిన నటుడు

నటుడు సుధీర్‌బాబు (Sudheer babu) నటిస్తోన్న కొత్త చిత్రం ‘మామా మశ్చీంద్ర’ (Maama Mascheendra). ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈసినిమా నుంచి ఫస్ట్‌ లుక్‌ విడుదలైంది.

Published : 01 Mar 2023 11:54 IST

హైదరాబాద్‌: కెరీర్‌లో సరైన విజయం కోసం శ్రమిస్తున్నాడు నటుడు సుధీర్‌బాబు (Sudheer Babu). ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, ‘హంట్‌’ (Hunt) చిత్రాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ అవి మిశ్రమ స్పందనలకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం అతడి దృష్టి మొత్తం ‘మామా మశ్చీంద్ర’ (Maama Mascheendra)పైనే ఉంది. ఈ సినిమా కోసం గుర్తుపట్టలేనంతగా మారాడు. ఇప్పటివరకూ సిక్స్‌ ప్యాక్‌తో ఫిట్‌నెస్‌ లుక్‌లో కనిపించిన సుధీర్‌.. ఈ సినిమాలో చాలా బొద్దుగా కనిపించనున్నాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఫస్ట్‌లుక్‌ను బుధవారం షేర్‌ చేశాడు. ‘బెట్‌.. ఇలా వస్తానని మీరు అనుకుని ఉండరు’ అని పేర్కొన్నాడు. దీనిని చూసి నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. ఎవరూ ఊహించని విధంగా సుధీర్‌ ట్విస్టులు ఇస్తున్నారని కామెంట్స్‌ చేస్తున్నారు.

సినీ రచయిత, నటుడు హర్షవర్ధన్‌ ‘మామా మశ్చీంద్ర’ (Maama Mascheendra) చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వినూత్నమైన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఇది రూపుదిద్దుకుంటోంది. ఇందులో సుధీర్‌ దుర్గా అనే పాత్రలో కనిపించనున్నారు. చేతన్‌ భరద్వాజ్‌ స్వరాలు అందిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ (ఎల్‌ఎల్‌పీ) పతాకంపై దీన్ని నిర్మించనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు