sudheer babu: కంటెంట్‌ ఉన్న సినిమాలకు మహేశ్‌బాబు మద్దతిస్తారు!

sudheer babu: కంటెంట్ ఉన్న సినిమాలకు అగ్రకథానాయకుడు మహేశ్ బాబు మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని సుధీర్ బాబు అన్నారు. శ్రీదేవి సోడా సెంటర్‌ గురించి ఆయన పంచుకున్న విశేషాలు..

Published : 30 Aug 2021 01:20 IST

హైదరాబాద్‌: కంటెంట్ ఉన్న సినిమాలకు అగ్రకథానాయకుడు మహేశ్ బాబు మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని సుధీర్ బాబు అన్నారు. మహేశ్‌తోపాటు ఎంతో మంది ప్రముఖులు తన తాజా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’ను ప్రశంసించారని ఆనందం వ్యక్తం చేశారు. ప్రేక్షకుల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తోందన్నారు. పలాస దర్శకుడు కరుణకుమార్ దర్శకత్వంలో ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం విడుదలైన అన్ని కేంద్రాల్లో విజయవంతంగా ప్రదర్శితమవుతూ ప్రశంసలందుకుంటోంది. ఈ సందర్భంగా ఈటీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన సుధీర్ బాబు.. తమ చిత్రంలో చూపించిన సామాజిక అంశం ప్రజల్లో ఆలోచన రేకెత్తిస్తుందన్నారు. ‘శ్రీదేవి సోడా సెంటర్‌’ గురించి సుధీర్‌బాబు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని