Sudheer Babu: ‘హరోం హర’గా రానున్న సుధీర్‌ బాబు..

సుధీర్‌బాబు హీరోగా జ్ఞానసాగర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు ‘హరోం హర’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ టైటిల్‌ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. 

Published : 31 Oct 2022 13:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సుధీర్‌బాబు. ఇటీవల ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. తాజాగా మరో ఆసక్తికర అంశంతో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వంలో సుధీర్‌బాబు హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈరోజు ఈ సినిమాకు సంబంధించిన పనులు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఈ సినిమాకు టైటిల్ ‘హరోం హర’ అని చిత్రబృందం అధికారికంగా ఖరారు చేసింది. ‘ది రివోల్ట్‌’ అనేది క్యాప్షన్‌. టైటిల్‌ వీడియోలో ‘ఇక చెప్పేదేం లేదు సేసేదే’ అంటూ సుధీర్‌ విభిన్నమైన యాసతో చెప్పిన డైలాగ్‌ ఆకట్టుకునేలా ఉంది. బ్యాక్‌గ్రౌండ్‌ ఆధారంగా చూస్తే ఆధ్యాత్మిక అంశాలు కూడా హైలెట్‌ అయ్యే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. 1989 నాటి కుప్పం నేపథ్యంలో సాగే కథ ఇది. ఇందులో సుధీర్‌బాబు.. శివారెడ్డి తనయుడు సుబ్రమణ్యంగా కనిపించనున్నారు. సుమంత్‌ జి.నాయుడు నిర్మిస్తున్న ఈ సినిమాలో సుధీర్‌ మాస్‌ లుక్‌లో కనిపించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని