Sudheer Babu: అందుకే రణ్‌బీర్‌ ‘బ్రహ్మాస్త్ర’లో నటించలేదు: సుధీర్‌ బాబు

టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌కి స్థాయికి వెళ్లి నిరూపించుకున్న హీరోల్లో ఒకరు నటుడు సుధీర్‌ బాబు. 2016లో వచ్చిన ‘బాఘీ’తో (తెలుగులో ప్రభాస్‌ ‘వర్షం’) బాలీవుడ్‌లో విలన్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఆతరువాత ఎప్పుడూ హిందీ సినిమాల్లో నటించలేదు. దానికి గల కారణాలు ఇటీవల వెల్లడించారాయన.

Published : 12 Feb 2022 02:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ స్థాయికి వెళ్లి నిరూపించుకున్న హీరోల్లో ఒకరు నటుడు సుధీర్‌ బాబు. 2016లో వచ్చిన ‘బాఘీ’తో (తెలుగులో ప్రభాస్‌ ‘వర్షం’) బాలీవుడ్‌లో విలన్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత హిందీ సినిమాల్లో నటించలేదు. దానికి గల కారణాలు వెల్లడించారాయన. ఇటీవలే జాతీయ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పంచుకున్నారు.

‘‘హిందీలో నా తొలిచిత్రం ‘బాఘీ’. అందులో విలన్‌గా నా నటనకు చక్కటి స్పందన వచ్చింది. ఆ తరువాత బాలీవుడ్‌లో వరుసగా ఆఫర్స్‌ రావడం మొదలయ్యాయి. అయితే, నా మొదటి ప్రాధాన్యం తెలుగు సినిమాలకే. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో రణ్‌బీర్‌- ఆలియా ‘బ్రహ్మాస్త్ర’లోనూ ఓ ఆసక్తికర పాత్ర వచ్చింది. ఆ సినిమా షూటింగ్‌కి ఎక్కువ రోజులు కేటాయించాల్సి వచ్చింది. అదే సమయంలో ‘సమ్మోహనం’తో బిజీగా ఉండటం.. డేట్స్‌ సర్దుబాటు కాక ఆ పాత్రను వదులుకున్నా. ‘బ్రహ్మాస్త్ర’ వంటి పాన్‌ ఇండియా చిత్రంలో నటించడమనేది పెద్ద అవకాశం. అయితే ‘సమ్మోహనం’ నా కెరీర్‌లో ఆల్‌ టైమ్ హిట్‌గా నిలిచింది’’ అని తెలిపారు.

ప్రస్తుతం తెలుగులో మోహన కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కిస్తున్న ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చిత్రంలో సుధీర్‌బాబు నటిస్తున్నారు. గతంంలో మోహన్‌ కృష్ణ దర్శకత్వంలోనే వచ్చిన ‘సమ్మోహనం’, ‘వి’లో నటించారాయన. జాతీయ బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపిచంద్‌ బయోపిక్‌లోనూ నటించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు