Sudheer Babu: దాన్ని ప్రశంసగానే స్వీకరిస్తున్నా: ‘హరోం హర’ ఫీడ్‌బ్యాక్‌పై సుధీర్‌ బాబు

‘హరోం హర’కు ప్రేక్షకులు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ బాగుందని హీరో సుధీర్‌ బాబు అన్నారు. ఆ సినిమా సక్సెస్‌ సెలబ్రేషన్స్‌లో ఆయన మాట్లాడారు.

Published : 15 Jun 2024 00:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తాను నటించిన ‘హరోం హర’ (haromhara) చిత్రాన్ని ప్రేక్షకులు ‘పుష్ప’, ‘కేజీయఫ్‌’లతో పోల్చడంపై హీరో సుధీర్‌ బాబు (Sudheer Babu) స్పందించారు. దాన్ని ప్రశంసగానే స్వీకరిస్తున్నానని చెప్పారు. దర్శకుడు జ్ఞానసాగర్‌ ద్వారక తెరకెక్కించిన ఆ చిత్రం శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ పూర్తయిన అనంతరం చిత్ర బృందం మీడియాతో ముచ్చటింది.

సుధీర్‌ బాబు మాట్లాడుతూ.. ‘‘నా కెరీర్‌లోనే మంచి ఓపెనింగ్స్‌ వచ్చిన సినిమా ఇది. దీనికి వచ్చిన స్పందన మరే చిత్రానికీ రాలేదు. ఆడియన్స్‌ ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ చూశా. పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమని చాలా మంది చెప్పారు. ఒక్క యాక్షన్‌ సీక్వెన్స్‌తోనే కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లారని, సినిమా చివరి వరకు అదే టెంపో కొనసాగించారని చెబుతుంటే ఆనందంగా ఉంది. ఈ సినిమాని ‘కేజీయఫ్‌’, ‘పుష్ప’లతో పోల్చారు. దాన్ని నేను కాంప్లిమెంట్‌ అనుకుంటున్నా. పరిమిత బడ్జెట్‌తో రూపొందిన మా సినిమా వాటితో మ్యాచ్‌ అయిందంటే మేం ఏదో సాధించినట్టే. యాక్షన్‌ సీక్వెన్స్‌ విషయంలో టాప్‌లో నిలిచే చిత్రాల్లో ఇదీ ఒకటి’’ అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో సుధీర్‌ మునుపెన్నడూ చూడని లుక్‌లో కనిపించారు. సుబ్రహ్మణ్యం పాత్రలో అలరించారు.

రివ్యూ కోసం క్లిక్‌ చేయండి..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు