Sudheer: అప్పుడు సాఫ్ట్‌వేర్.. ఇప్పుడు గాలోడు

 రాజ‌శేఖ‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో సుడిగాలి సుధీర్ న‌టించిన చిత్రం సాఫ్ట్‌వేర్ సుధీర్‌. రొమాంటిక్ కామెడీ నేప‌థ్యంలో వ‌చ్చి ప్రేక్ష‌కుల్ని ఆకట్టుకుంది. మ‌రోసారి వినోదం పంచేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు రాజశేఖ‌ర్‌- సుధీర్‌. ఈ ఇద్ద‌రిక ఆఆంబినేష‌న్‌లో గాలోడు అనే చిత్రం తెర‌కెక్కుతోంది. నేడు సుధీర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ వివ‌రాలు ప్ర‌క‌టించి, ఫ‌స్ట్‌లుక్‌ని విడుల చేసింది చిత్ర బృందం. 

Published : 19 May 2021 19:54 IST

ఇంట‌ర్నెట్ డెస్క్‌: రాజ‌శేఖ‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో సుడిగాలి సుధీర్ న‌టించిన చిత్రం  సాఫ్ట్‌వేర్ సుధీర్‌’. రొమాంటిక్ కామెడీ నేప‌థ్యంలో వ‌చ్చి ప్రేక్ష‌కుల్ని ఆకట్టుకుంది. మ‌రోసారి వినోదం పంచేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు రాజశేఖ‌ర్‌- సుధీర్‌. ఈ ఇద్ద‌రి  కాంబినేష‌న్‌లో  ‘గాలోడు’ అనే చిత్రం తెర‌కెక్కుతోంది. నేడు సుధీర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ వివ‌రాలు ప్ర‌క‌టించి, ఫ‌స్ట్‌లుక్‌ని విడుల చేసింది చిత్ర బృందం. ఇందులో సిగ‌రెట్ కాలుస్తూ స్టైలిష్ లుక్‌లో క‌నిపించి ఆసక్తి పెంచుతున్నాడు సుధీర్‌. సంస్కృతి ఫిల్మ్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నాయిక వివ‌రాలు వెల్ల‌డించ‌లేదు. మ‌రి సుధీర్ గాలోడుగా ఎందుకు మారాడు? అత‌ని క‌థేంటి?  తెలియాలంటే కొంత‌కాలం ఆగాల్సిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని