బుల్లితెర జలపాతంలో సుధీర్‌, రష్మి

బుల్లితెర సెన్సేషన్‌ జోడీ సుధీర్‌-రష్మి మరోసారి సందడి తెరపై చేసింది. ఈటీవీలో ఉగాది కానుకగా ‘ఉగాది జాతిరత్నాలు’ పేరుతో ఒక కార్యక్రమం ప్రసారమైంది. ఇందులో భాగంగా సుధీర్‌, రష్మి ‘ఉప్పెన’ చిత్రంలోని ‘జల జల జలపాతం నువ్వూ’ అంటూ సాగే పాటకు సందడి చేశారు.

Published : 14 Apr 2021 01:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బుల్లితెర సెన్సేషన్‌ జోడీ సుధీర్‌-రష్మి మరోసారి తెరపై సందడి చేసింది. ఈటీవీలో ఉగాది కానుకగా ‘ఉగాది జాతిరత్నాలు’ పేరుతో ఒక కార్యక్రమం ప్రసారమైంది. ఇందులో భాగంగా సుధీర్‌, రష్మి ‘ఉప్పెన’ చిత్రంలోని ‘జల జల జలపాతం నువ్వూ’ అంటూ సాగే పాటకు సందడి చేశారు. సినిమాలో హీరోహీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా వాళ్లు హావభావాలు పలికించారు. రష్మి అయితే.. తన నటనతో కుర్రకారుకు మత్తెక్కించినంత పని చేసింది. ఇక సుధీర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటిలాగే తనదైన మార్కు పెర్ఫార్మెన్స్‌ ఇచ్చాడు. ఈ కార్యక్రమంలో వీళ్ల ప్రదర్శన హైలైట్‌గా నిలిచింది. దీంతో యూట్యూబ్‌ రికార్డులు బద్దలు కావడం ఖాయమంటూ వీడియో కింద అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఆలస్యమెందుకు వీడియో మీరూ చూసేయండి మరి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని