Sudheer: కేంద్రం నిర్ణయంపై సుధీర్‌ అసహనం

సినిమాటోగ్రఫీ చట్టం -1952ను సవరిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల టాలీవుడ్‌ హీరో సుధీర్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమా ప్రదర్శనలకు కేంద్రీయ చలన చిత్ర ధ్రువీకరణ సంస్థ (సి.బి.ఎఫ్‌.సి) జారీ చేసే ధ్రువపత్రాల అధికారం..

Published : 04 Jul 2021 15:00 IST

సీబీఎఫ్‌సీతో ప్రయోజనమేమిటి?

హైదరాబాద్‌: సినిమాటోగ్రఫీ చట్టం -1952ను సవరిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల టాలీవుడ్‌ హీరో సుధీర్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమా ప్రదర్శనలకు కేంద్రీయ చలన చిత్ర ధ్రువీకరణ సంస్థ (సి.బి.ఎఫ్‌.సి) జారీ చేసే ధ్రువపత్రాల అధికారం.. కేంద్రం ఆధీనంలోకి తీసుకుంటూ చట్టాన్ని రూపొందించాలన్న నిర్ణయంపై సినీ పరిశ్రమలో కొన్నిరోజుల నుంచి అసంతృప్తి రగులుతోంది. ఈ నేపథ్యంలో నటుడు సుధీర్‌ ట్విటర్‌ వేదికగా.. సినిమాటోగ్రఫీ చట్ట సవరణపై వరుస ట్వీట్లు పెట్టారు. చట్ట సవరణ వల్ల భావ ప్రకటన స్వేచ్ఛ దెబ్బతింటుందని ఆయన అన్నారు. సినిమా రీ సెన్సార్‌పై స్పందిస్తూ.. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ ఉండి ప్రయోజనమేమిటని ఆయన ప్రశ్నించారు.

‘సినిమాటోగ్రఫీ యాక్ట్‌-2021 విషయంలో కేంద్రం పునరాలోచించాలి. సీబీఎఫ్‌సీ కింద ఇప్పటికే మేము ఓ కఠినమైన ప్రక్రియను బాధ్యతగా పాటిస్తున్నాం. సెన్సార్‌ బోర్డ్‌ జారీ చేసే ధ్రువపత్రాల అధికారం.. కేంద్రం ఆధీనంలోకి తీసుకోవడం వల్ల ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అది.. ఎలాంటి సినిమాలు చూడాలనుకుంటే అలాంటి వాటికి మాత్రమే ఆమోదం లభించే అవకాశం ఉంది. ఇది సబబు కాదు. ఇప్పటికే ఎన్నో విషయాల్లో సినిమాని చాలా సులువుగా టార్గెట్‌ చేస్తున్నారు. ఇప్పుడు కనుక ఆ సినిమాటోగ్రఫీ సవరణ చట్టానికి ఆమోదం తెలపడం వల్ల ఇకపై సినిమాని టార్గెట్‌ చేయడం మరింత సులువవుతుంది. రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛను మనం కోల్పోకూడదు. అలాగే, సినిమా విషయంలో ప్రతిసారీ భయపడే వాతావరణం మాకు అక్కరలేదు. మరొక విషయం ఏమిటంటే ప్రతి సినిమానీ రీ-సెన్సార్‌ చేయాలనుకున్నప్పుడు ఇక సీబీఎఫ్‌సీ ఉండి ప్రయోజనం ఏమిటి?’ అని ఆయన ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని