Om Puri: రాత్రి షూటింగ్‌ అంటే ఓంపురి అరిచేసేవారు

భారతీయ సినిమాపై తనదైన ముద్ర వేసిన కొద్దిమంది విలక్షణ నటుల్లో ఓంపురి ఒకరు. పలు ఇంగ్లిష్‌ చిత్రాల్లోనూ తనదైన శైలిలో నటించి అంతర్జాతీయంగానూ గుర్తింపు తెచ్చుకున్నారు. ‘ఆక్రోశ్‌’, ‘ఆరోహణ్‌’, ‘అర్ధ్‌ సత్య’, ‘సద్గతి’, ‘తమస్‌’ తదితర చిత్రాల్లో

Updated : 25 Sep 2022 07:16 IST

భారతీయ సినిమాపై తనదైన ముద్ర వేసిన కొద్దిమంది విలక్షణ నటుల్లో ఓంపురి (Om Puri) ఒకరు. పలు ఇంగ్లిష్‌ చిత్రాల్లోనూ తనదైన శైలిలో నటించి అంతర్జాతీయంగానూ గుర్తింపు తెచ్చుకున్నారు. ‘ఆక్రోశ్‌’, ‘ఆరోహణ్‌’, ‘అర్ధ్‌ సత్య’, ‘సద్గతి’, ‘తమస్‌’ తదితర చిత్రాల్లో ఆయన పాత్రల్ని ప్రేక్షకులు మర్చిపోలేరు. చాలా మంచి నటుడు, సెట్లో ఎంతో నిబద్ధతతో పనిచేసే వ్యక్తి...సాంకేతికతపై పట్టున్న మనిషి...ఇలా ఆయన గురించి ఎంతో గొప్పగా చెబుతుంటారు ఆయనతో పనిచేసిన నటులు, సాంకేతిక నిపుణులు. ఓంపురితో కలిసి పనిచేసిన దర్శకుడు సుధీర్‌ మిశ్రా (Sudhir Mishra)  కూడా ఇదే మాటలు చెబుతున్నారు. కానీ కొన్ని విషయాల్లో మాత్రం ఓంపురి అంటే తనకు నచ్చదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నిర్మొహమాటంగా మనసులో మాట చెప్పేశారు. ‘‘ఓంపురి సర్‌ కొన్ని విషయాల్లో చాలా సీరియస్‌ అవుతుంటారు. ముఖ్యంగా రాత్రి పన్నెండు తర్వాత షూటింగ్‌ అంటే ఆయనకు మహా చిరాకు, కోపం. సెట్లో అరిచేసేవారు. ఆయనతో నా మూడో చిత్రం ‘ధారావి’ చిత్రీకరణ సమయంలో ఇలాంటివి చాలానే చూశాను. ‘నీతో ఇంకెప్పుడూ సినిమా చేయను’ అని కూడా ఓ సందర్భంలో అనేశారు. ఆ తర్వాత ఓంపురి, నసీరుద్ధీన్‌ షా లాంటి సీనియర్‌ నటులతో కలిసి పనిచేయకూడదని నిర్ణయించుకున్నాను’’అని చెప్పారు సుధీర్‌ మిశ్రా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని