Sudigaali Sudheer: అమ్మ కొడుకు ఆణిముత్యమా..ఆటమ్‌బాంబా?

వెండితెరపై స్టార్‌హీరోలకు సమానంగా బుల్లితెరపై క్రేజ్‌ సొంతం చేసుకున్న నటుడు సుధీర్‌.

Updated : 29 Jan 2022 18:03 IST

హైదరాబాద్‌: వెండితెరపై స్టార్‌ హీరోలకు ఏ స్థాయి క్రేజ్‌ ఉంటుందో బుల్లితెరపై అంతటి ఇమేజ్‌ను సొంతం చేసుకున్న నటుడు సుధీర్‌. ‘జబర్దస్త్‌’ షోతో ‘సుడిగాలి’ సుధీర్‌గా ప్రతి తెలుగు ప్రేక్షకుడికి అతడు సుపరిచితమే. ఇక గెటప్‌ శ్రీను, ఆటో రాంప్రసాద్‌లతో కలిసి అతడు చేసే స్కిట్‌లు కడుపుబ్బా నవ్విస్తాయి. తాజాగా ప్రసారమైన ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’లో షో జడ్జి రోజాతోనే కలిసి సుధీర్‌ ఓ స్కిట్ చేశారు. రష్మి, బుల్లెట్‌ భాస్కర్‌లపై సుధీర్‌ వేసిన పంచ్‌లు, అతడిని సమర్థిస్తూ రోజా చెప్పిన డైలాగ్‌లు నవ్వులు పూయిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఆద్యంతం నవ్వులు పండించిన ఆ స్పెషల్‌ ఎపిసోడ్‌ను చూసేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని