Sudigali Sudheer: సుధీర్‌ ‘గాలోడు’ ఓటీటీలోకి వస్తోంది.. ఆ రోజే విడుదల

సుడిగాలి సుధీర్‌, గెహనా సిప్పీ జంటగా నటించిన చిత్రం ‘గాలోడు’. గతేడాది థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి రానుంది.

Updated : 15 Feb 2023 18:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సుడిగాలి సుధీర్‌ (Sudigali Sudheer) హీరోగా నటించిన ‘గాలోడు’ (Gaalodu) సినిమా ఓటీటీ (OTT) విడుదల ఖరారైంది. ఈ నెల 17 నుంచి ‘ఆహా’ (Aha), అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఓటీటీ వేదికల్లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా ప్రకటిస్తూ సదరు సంస్థ పోస్టర్‌ పంచుకుంది. ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’ తర్వాత దర్శకుడు రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల- సుధీర్‌ కాంబినేషన్‌లో రూపొందిన రెండో సినిమా ఇది. గెహనా సిప్పీ కథానాయిక. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం గతేడాది నవంబరులో థియేటర్లలో రిలీజ్‌ అయిన సంగతి తెలిసిందే.

ఇదీ కథ: రాజు (సుధీర్) పనీపాటా లేకుండా ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటాడు. జూదంలో జరిగిన గొడవలో తన గ్రామ సర్పంచ్‌ కొడుకు చనిపోవడంతో రాజు హైదరాబాద్‌ పారిపోతాడు. అక్కడ ఆయనకు శుక్ల (గెహనా) అనే అమ్మాయితో పరిచయం ఏర్పడి, ప్రేమగా మారుతుంది. మరోవైపు, పోలీసులు వెతికిపట్టుకుని రాజును అరెస్ట్‌ చేస్తారు. అతను జైలు నుంచి ఎలా బయటకు వచ్చాడు? అన్నది మిగతా కథ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని