Suhasini: అది నా ప్రాజెక్ట్‌.. నువ్వు లాక్కున్నావు: సుహాసిని

తమిళంలో ప్రసారమవుతోన్న ఓ సెలబ్రిటీ టాక్‌ షోకు నటి సుహాసిని (Suhasini) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నటి రేవతి (Revathi) అతిథిగా పాల్గొన్నారు.

Published : 13 May 2023 21:14 IST

చెన్నై: శివాజీ గణేశన్‌, కమల్‌ హాసన్‌, రేవతి ప్రధాన పాత్రల్లో నటించిన ఒకప్పటి సూపర్‌హిట్‌ చిత్రం ‘తేవర్ మగన్’. ఇదే చిత్రం ‘క్షత్రియ పుత్రుడు’ పేరుతో తెలుగులోనూ సక్సెస్‌ అందుకుంది. తాజాగా ఈ ప్రాజెక్ట్‌ గురించి సుహాసిని, రేవతి చర్చించుకున్నారు. సుహాసిని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఓ సెలబ్రిటీ చిట్‌ చాట్‌ షోలో రేవతి పాల్గొన్నారు. ఇందులో సుహాసిని (Suhasini) మాట్లాడుతూ.. ‘‘నేను చేయాల్సిన చాలా ప్రాజెక్ట్‌లు నువ్వు లాగేసుకున్నాం. అలాగే, ఈ క్లాసిక్‌ హిట్‌నూ సొంతం చేసుకున్నావు. అప్పుడు నా డేట్స్‌ కుదరకపోవడం వల్లే నేను దీన్ని చేయలేకపోయా’’ అని అన్నారు.

దీనిపై రేవతి స్పందిస్తూ.. ‘‘క్షత్రియ పుత్రుడు’ నేను లాక్కొలేదు. నాకు ఎలాంటి సంబంధం లేదు. కావాలంటే దర్శకుడు భరతన్‌, లేదా కమల్‌ హాసన్‌ను అడుగు (నవ్వులు). ప్రియదర్శన్‌ వల్లే ఆ సినిమా చేయగలిగాను. ప్రియదర్శన్‌ డైరెక్షన్‌లో నేను సినిమా చేస్తున్నప్పుడు భరతన్‌ నుంచి నాకు కాల్‌ వచ్చింది. ప్రియదర్శన్‌ పర్మిషన్‌ తీసుకుని.. భరతన్‌ను కలవడానికి వెళ్లాను. పూర్తి స్క్రిప్ట్‌ నా చేతిలో పెట్టి చదువుకోమన్నారు. ఆ కథ కమల్‌హాసన్‌ రాశారు. అది నాకెంతో నచ్చింది. కాకపోతే, పంచవర్ణం (రేవతి పాత్ర పేరు)ను ఎలా చేయాలో నాకు అర్థం కాలేదు. భరతన్‌ సపోర్ట్‌ చేశారు. అలా, ఫస్ట్‌ డే షూట్‌ చేశాం. తర్వాత కొన్నిరోజుల గ్యాప్‌ తీసుకుని.. రెగ్యులర్‌ షూట్‌ మొదలుపెట్టాం. ఆ సినిమా సూపర్‌హిట్‌ అందుకుంది. ఉత్తమ సహాయనటిగా నాకు జాతీయ అవార్డు కూడా లభించింది. ఆ క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేను’’ అని రేవతి వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు