ప్రభాస్‌ ఫ్యాన్స్‌ కామెంట్లు.. సుజీత్‌ రియాక్షన్‌

‘‘సాహో’ డిలీట్‌ సీన్లు ఎప్పుడు ఇస్తావు అన్నా?’ అంటూ ప్రభాస్‌ అభిమానులు సుజీత్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. దీనికి ‘సాహో’ దర్శకుడు స్పందిస్తూ.. ‘అన్నో.. నేనే కదా విడుదల చేస్తానని చెప్పా. సీన్‌ ఉంది రా స్వామీ దానికి బేసిక్‌ వీఎఫ్‌ఎక్స్‌ చేయించాలి. కొవిడ్‌ వల్ల ఆ కంపెనీ లేదు. నా పైసలతో నేనే చేస్తా, ఓపిక పట్టు..

Published : 20 Nov 2020 22:57 IST

‘ఛత్రపతి’ రీమేక్‌పై కూడా స్పష్టత

హైదరాబాద్‌: ‘‘సాహో’ డిలీట్‌ సీన్లు ఎప్పుడు ఇస్తావు అన్నా?’ అంటూ ప్రభాస్‌ అభిమానులు ఆ చిత్ర దర్శకుడు సుజీత్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. దీనికి ‘సాహో’ దర్శకుడు స్పందిస్తూ.. ‘అన్నో.. నేనే కదా విడుదల చేస్తానని చెప్పా. దానికి బేసిక్‌ వీఎఫ్‌ఎక్స్‌ చేయించాలి. కొవిడ్‌ వల్ల ఆ కంపెనీ లేదు. నా పైసలతో నేనే చేస్తా, ఓపిక పట్టు..’ అని వివరించారు.

అదేవిధంగా తను ఎటువంటి రీమేక్‌లు తీయడం లేదని సుజీత్‌ స్పష్టం చేశారు. టాలీవుడ్‌ కథానాయకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ తెలుగు హిట్‌ ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ రీమేక్‌కు సుజీత్‌ దర్శకత్వం వహించబోతున్నారని ప్రచారం జరిగింది. దీనిపై ఆయన సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. ‘ఏ రీమేక్‌లు చేయడం లేదు..’ అని పోస్ట్‌ చేశారు. మరోపక్క ‘లూసీఫర్‌’ చిత్రాన్ని తెలుగులో చిరంజీవితో రూపొందిస్తున్నారు. దీనికి సుజీత్‌ దర్శకత్వం వహించబోతున్నారని తొలుత చెప్పుకొచ్చారు. చివరికి దాని దర్శకత్వ బాధ్యతల్ని వి.వి. వినాయక్‌ తీసుకున్నారు. సొంతంగా కథ రాస్తున్న నేపథ్యంలో సుజీత్‌ సినిమా ఆఫర్లను తిరస్కరిస్తున్నారని ఫిల్మ్‌ నగర్‌ వర్గాలు చెబుతున్నాయి.

శర్వానంద్‌ ‘రన్‌ రాజా రన్‌’ సినిమాతో సుజీత్‌ దర్శకుడిగా కెరీర్‌ ఆరంభించారు. ఈ సినిమాకు దర్శకత్వం, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌, కథ.. అన్నీ ఆయనే సమకూర్చారు. 2014లో విడుదలైన ఈ సినిమా హిట్‌ అందుకోవడంతో ఆయనకు టాలీవుడ్‌లో గుర్తింపు లభించింది. ఆపై ప్రభాస్‌ హీరోగా ‘సాహో’ రూపొందించారు. భారీ బడ్జెట్‌తో యాక్షన్‌ కథాంశంగా తెరకెక్కించిన ఈ సినిమా గత ఏడాది విడుదలైంది. దీని తర్వాత సుజీత్‌ తన తర్వాతి ప్రాజెక్టును ప్రకటించలేదు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు