Cinema News: ఒక జానర్‌తో ప్రేక్షకుల్ని మెప్పించలేం..

‘శుక్ర’తో దర్శకుడిగా పరిచయమైన సుకు పూర్వజ్‌.. రెండో చిత్రంగా ‘మాటరాని మౌనమిది’ తెరకెక్కించారు. ఇది మల్టీజానర్‌గా ప్రేక్షకులపై ప్రత్యేకమైన ముద్ర వేస్తుందన్నారు.

Updated : 17 Aug 2022 10:23 IST

‘శుక్ర’తో దర్శకుడిగా పరిచయమైన సుకు పూర్వజ్‌.. రెండో చిత్రంగా ‘మాటరాని మౌనమిది’ తెరకెక్కించారు. ఇది మల్టీజానర్‌గా ప్రేక్షకులపై ప్రత్యేకమైన ముద్ర వేస్తుందన్నారు. మహేష్‌ దత్త, శ్రీహరి ఉదయగిరి, సోని శ్రీవాస్తవ ప్రధాన పాత్రలు పోషించారు. ఈనెల 19న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...

‘థ్రిల్లర్‌, హారర్‌, కామెడీ... ఇలా ప్రతి సినిమాలో ఏదో ఒక అంశం ప్రధానంగా కనిపిస్తుంటుంది. ఈ చిత్రంలో అన్నింటినీ కలిపి ఓ మల్టీజానర్‌గా చేశాం. వెంటాడే రెండు ప్రేమకథలతోపాటు, నవ్వించే అంశాలు ఉంటాయి. ప్రత్యేక ప్రదర్శనలో చూసినవాళ్లంతా చాలా బాగుందని మెచ్చుకుంటున్నారు. ఒక జానర్‌ కథతో సినిమా తీసి ప్రేక్షకుల్ని మెప్పించడం కష్టం. పాత్రలు బాగా లేవనో, సాగదీతగా ఉందనో పది నిమిషాల్లోనే తేల్చేస్తారు. కానీ ఇలాంటి సినిమాల్లో జానర్స్‌ మారుతూ ఉంటాయి. కాబట్టి ఆసక్తి కొనసాగుతూ ఉంటుంది. ఇలాంటి కథల్ని తెరకెక్కించడంలో నాకు అనుభవం ఉంది. గతంలో కొన్ని లఘు చిత్రాలు చేశా. అవి ముంబయి, న్యూయార్క్‌ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శితం అయ్యాయి. ముందు ఈ కథని మూకీగా తెరకెక్కిద్దాం అనుకున్నాం. ‘పుష్పకవిమానం’ వచ్చి చాలా కాలమైంది కదా.. కొత్తగా ఉంటుందనుకున్నాం. కానీ నిర్మాతలు ఈ కథలోని పాత్రలు మాట్లాడితే బాగుంటుందన్నారు. ఇందులో రెండు ప్రధాన పాత్రలకి సంభాషణలు ఉండవు. అనుకోని పరిస్థితులు ఎదురైతే ఆ సందర్భాన్ని వాళ్లెలా దాటుకుని ముందుకు వెళతారన్నది ఆసక్తికరం. త్వరలోనే మాఫియా, యాక్షన్‌ ప్రధానంగా సాగే సినిమా చేయాలనుకుంటున్నా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని