Sukumar: అభిమాన పంట

అగ్ర దర్శకుడు సుకుమార్‌కు అభిమాన పంట పండింది. ఆయనపై ఉన్న అభిమానాన్ని ఓ నవ హీరో తన రెండున్నర ఎకరాల పొలంలో యాభై రోజుల వరిపంటతో ప్రదర్శించారు. ఈ అరుదైన దృశ్యానికి కడప

Updated : 17 Mar 2022 17:01 IST

గ్ర దర్శకుడు సుకుమార్‌కు అభిమాన పంట పండింది. ఆయనపై ఉన్న అభిమానాన్ని ఓ నవ హీరో తన రెండున్నర ఎకరాల పొలంలో యాభై రోజుల వరిపంటతో ప్రదర్శించారు. ఈ అరుదైన దృశ్యానికి కడప జిల్లాలోని బోరెడ్డిగారిపల్లి గ్రామం వేదికైంది. ఆ వివరాల్లోకి వెళితే... ‘దూరదర్శిని’ సినిమాలో కథానాయకుడిగా నటిస్తున్న సువీక్షిత్‌ బొజ్జా దర్శకుడు సుకుమార్‌కు వీరాభిమాని. ఆ అభిమానాన్ని చాటి చెప్పేందుకు సొంత గ్రామంలోని వ్యవసాయ భూమిలో సుకుమార్‌ రూపంతో కనిపించేలా వరి పంటని సాగు చేశారు. యాభై రోజుల తర్వాత డ్రోన్‌ కెమెరాతో ఆ పంటని చిత్రీకరించారు. సుకుమార్‌ పేరుపై ప్రత్యేకంగా ఓ పాటని కూడా సిద్ధం చేశారు. సుకుమార్‌ రూపంతోపాటు ‘పుష్ప 2’ పేరు కూడా కనిపించేలా పంట సాగు చేశాడు నవనీత్‌. ఇటీవలే తన కార్యాలయంలో ఆ పంటకు సంబంధించిన వీడియోని చూసిన సుకుమార్‌ ‘నా నోట మాట రావడం లేదు, నా కళ్లు చెమర్చాయి. ఓ మనిషిమీద ఇంత అభిమానం ఉంటుందా?’ అంటూ సువీక్షిత్‌ని అభినందించారు. ఇటీవలే అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ తెరకెక్కించిన  ‘పుష్ప’ పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల్ని అలరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘పుష్ప 2’ను పట్టాలెక్కించే పనిలో ఉన్నారు సుకుమార్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని