Pushpa The Rule: ‘పుష్ప2’ కోసం సుకుమార్ బాహుబలి ఐడియాని ఫాలో అవుతారా..!
పుష్ప సినిమా ఓ బెంచ్‌మార్క్‌ను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో అభిమానులు పుష్ప2పై భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.
హైదరాబాద్: ప్రస్తుతం సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా పుష్ప-2(Pushpa2). గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప- దిరైజ్ మూవీ ఊహించని విజయాన్ని అందుకుంది. విడుదలైన అన్ని ప్రాంతాల్లో రికార్డులు సృష్టించింది. ఇక అల్లుఅర్జున్(Allu Arjun) తనదైన శైలిలో అలరించి ఫ్యాన్స్‌కు ఆనందాన్ని పంచారు. దీంతో పుష్ప2పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. వాళ్ల అంచనాలు అందుకునేలా పుష్ప ది రూల్‌ని తీర్చిదిద్దుతున్నారు డైరెక్టర్ సుకుమార్. తాజాగా ఈ చిత్రం గురించి ఓ వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
నవంబర్ రెండో వారం నుంచి రామోజీ ఫిల్మి సిటీలో షూటింగ్ జరుగుతుందని చిత్రబృందం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ షూటింగ్ కోసం ఫిల్మి సిటీ లోపల బాహుబలి తరహాలో ఓ భారీ సెట్ ఏర్పాటు చేశారంటున్నారు. అక్కడ ఒక షెడ్యూల్ పూర్తిచేశాక విదేశాలకు వెళ్లనున్నారట. ఈ విషయం తెలిసిన అభిమానులు పుష్ప సినిమా మరో బహుబలి(Baahubali) కానుందని తెగ ఖుషీ అవుతున్నారు. పుష్ప ది రైజ్‌లో ఎర్రచందనం స్మగ్లర్‌గా కనిపించిన అల్లుఅర్జున్ పుష్ప ది రూల్‌లో ఎలా ఉంటాడో అని అందరిలో ఆసక్తి నెలకొంది. కాగా, ఇటీవల పుష్ప సినిమాటోగ్రాఫర్ మిరోస్లా కూబా బ్రొజెక్ ‘‘సాహసం ప్రారంభమైంది..’ అంటూ అల్లుఅర్జున్ లేటెస్ట్ ఫొటో షేర్ చేసిన సంగతి తెలిసందే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Amaravati: ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్.. ఓటేసిన సీఎం జగన్
-
Sports News
IPL: ఇకపై టాస్ గెలిచాకే.. ఐపీఎల్ నిబంధనల్లో మార్పులు చేసిన బీసీసీఐ
-
Movies News
Kalyan Ram: ఆయనతో నన్ను పోల్చవద్దు.. అంత పెద్దవాణ్ని కాదు: కళ్యాణ్‌రామ్
-
Crime News
Hyderabad: దేశవ్యాప్తంగా వ్యక్తిగత డేటా చోరీ.. పోలీసుల అదుపులో ముఠా
-
Movies News
Samyuktha: ‘విరూపాక్ష’ టీమ్‌పై నటి సంయుక్త ఆగ్రహం
-
India News
Kerala: సమాధిపై క్యూఆర్ కోడ్!.. వైద్యుడైన కుమారుడి స్మృతులకు కన్నవారి నివాళి