Sukumar: వరి పంటతో సుకుమార్‌ చిత్రం.. కట్టిపడేసిన అభిమానం!

హీరో, హీరోయిన్లకే కాదు కొందరు దర్శకులకూ విశేష అభిమానగణం ఉంటుంది. హీరోలకు ఏమాత్రం తగ్గని క్రేజ్‌ ఉంటుంది. ఈ కోవలోకే వస్తారు సుకుమార్‌. ‘ఆర్య’ సినిమాతో మెగాఫోన్‌ పట్టిన ఆయన ‘పుష్ప’ చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.

Published : 16 Mar 2022 20:06 IST

కడప: హీరో, హీరోయిన్లకే కాదు కొందరు దర్శకులకూ విశేష అభిమానగణం ఉంటుంది. హీరోలకు ఏమాత్రం తగ్గని క్రేజ్‌ ఉంటుంది. ఈ కోవకి చెందిన వారిలో సుకుమార్‌ ఒకరు. ‘ఆర్య’ సినిమాతో మెగాఫోన్‌ పట్టిన ఆయన ‘పుష్ప’ చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. సినిమా సినిమాకూ వైవిధ్యం చూపిస్తూ ఎందరో అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. వారిలో ఒకరైన సువీక్షిత్‌ బొజ్జా.. సుకుమార్‌పై ఉన్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. సొంతూరు బోరెడ్డిగారిపల్లిలోని తన వ్యవసాయక్షేత్రంలో వరి పంటతో సుకుమార్‌ రూపం, ‘పుష్ప 2’ లోగోను తీర్చిదిద్దారు. చూడగానే ఆకట్టుకునే ఈ చిత్రాన్ని డ్రోన్‌ కెమెరా సాయంతో షూట్‌ చేసి సంబంధిత వీడియోను సుకుమార్‌కు చూపించారు. ఈ వీడియో, తనపై ప్రత్యేకంగా రూపొందించిన పాటను విన్న సుకుమార్‌.. ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఈ ఫొటోలు, వీడియో నెట్టింట వైరల్‌గా మారాయి. అటు సుకుమార్‌ అభిమానులతోపాటు, ఇటు ‘పుష్ప’ హీరో అల్లు అర్జున్‌ అభిమానులు సువీక్షిత్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. తన అభిమాన దర్శకుడి చిత్రాన్ని రూపొందించేందుకు సువీక్షిత్‌ సుమారు 50 రోజులు శ్రమించారు. మరోవైపు ‘దూరదర్శని’ అనే సినిమాతో సువీక్షిత్‌ హీరోగా పరిచయం కానున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని