Karthi Sulthan: ఓటీటీలో వచ్చేది ఆ రోజే

కార్తి, రష్మిక నటించిన ‘సుల్తాన్’‌ (Sulthan) ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌...

Updated : 26 Apr 2021 16:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కార్తి, రష్మిక జంటగా తెరకెక్కిన చిత్రం ‘సుల్తాన్‌’. భాగ్యరాజ్‌ కణ్ణన్‌ దర్శకుడు. థియేటర్లలో ఏప్రిల్‌ 2న విడుదలై అటు కోలీవుడ్‌లో, ఇటు టాలీవుడ్‌లో మంచి విజయం అందుకుంది. మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు ఓటీటీ వేదికగా సిద్ధమవుతోంది. ప్రముఖ ఓటీటీ ‘ఆహా’లో ఏప్రిల్‌ 30 నుంచి ప్రసారం కానుంది. ఈ మేరకు ట్వీట్ చేసింది ఆహా సంస్థ. యాక్షన్‌ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో నెపోలియన్‌, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. డ్రీమ్‌ వారియర్స్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌.ఆర్‌. ప్రకాశ్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు నిర్మించారు. ఈ సినిమాకి సంగీతం: వివేక్‌ మర్విన్‌, నేపథ్య సంగీతం: యువన్‌ శంకర్‌ రాజా.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని