వర్ష చందమామ అయితే.. మరి ఇమ్మాన్యుయేల్‌?

వర్ష.. ఇమ్మాన్యుయేల్‌లను చూసిన తర్వాత ఓటీటీల్లో ‘కలర్‌ఫోటో’ సినిమా చూడక్కర్లేదంటున్నారు యాంకర్‌ సుమ. ఆమె

Published : 04 Jan 2021 01:19 IST

హైదరాబాద్‌: వర్ష, ఇమ్మాన్యుయేల్‌ను చూసిన తర్వాత ఓటీటీల్లో ‘కలర్‌ఫోటో’ సినిమా చూడక్కర్లేదంటున్నారు యాంకర్‌ సుమ. ఆమె వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ఎంటర్‌టైనింగ్‌ ప్రోగ్రామ్‌ ‘క్యాష్‌’. ఈసారి జబర్దస్త్‌ నటులు ఇమ్మాన్యుయేల్‌- వర్ష, నూకరాజు- హనమంతి, బాబు- పావని, పరదేశి-ఉదయశ్రీలు జోడీగా వచ్చి సందడి చేశారు.

ఈ సందర్భంగా పరదేశిని ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. ఇక ‘సుమ ఫ్యామిలీ’ అంటూ చేసిన స్కిట్‌ తెగ నవ్వులు పంచుతోంది. ఈ సరదా కార్యక్రమాన్ని చూడాలంటే జనవరి 9వ తేదీ వరకూ వేచి చూడాల్సిందే. అప్పటివరకూ ఈ ప్రోమో చూసేయండి...


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని